Begin typing your search above and press return to search.

కాల‌రేగ‌రేసి మ‌రీ కొట్టాడు తార‌క్

సినిమా రిలీజ్ అనంత‌రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన త‌ర్వాత ఏర్పాటు చేసిన విజయోత్స‌వ స‌భ‌లో ప‌సుపు రంగు టీష‌ర్ట్ కాల‌రెగ‌రేసి హిట్ కొట్టాన‌ని ఎంతో గ‌ర్వంగా చెప్పాడు మ‌హేష్‌.

By:  Tupaki Desk   |   5 Oct 2024 6:55 AM GMT
కాల‌రేగ‌రేసి మ‌రీ కొట్టాడు తార‌క్
X

సినిమా రిలీజ్ కి ముందే కాల‌రెగ‌రేసి హిట్ కొడుతున్నాను? అనే మాట చిన్న‌ది కాదు. అలాంటి ప్రామిస్ అభిమానుల‌కు ఇవ్వాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కంటెంట్ పై ఎంతో కాన్పిడెంట్ గా ఉండాలి. ఎంతో బాధ్య‌తతోనూ కూడిన మాట అది. తార‌క్ ఇప్పుడ‌ది నిరూపించి చూపించాడు. 'దేవ‌ర' రిలీజ్ కి ముందు ఓ సినిమా ఈవెంట్ లో అతి అనుకోక‌పోతే ఒక‌టి చెబుతాను. కాల‌రెగ‌రేసి చెబుతున్నా దేవ‌ర హిట్ అని ముందే చెప్పాడ తార‌క్.

అత‌డు చెప్పింది చెప్పిన‌ట్లు చేసి చూపించాడు. 'దేవర' బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. భారీ ఓపెనింగ్స్ తో అద‌ర గొట్టింది. రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేక‌పోయినా వాటితో సంబంధం లేకుండా' దేవ‌ర' వ‌సూళ్ల సునామీ కొన‌సాగిస్తుంది. అయితే ఇలాంటి అనుభ‌వం తార‌క్ కి ఇది తొలిసారి కాదు. గ‌తంలో 'జ‌న‌తా గ్యారేజ్' కి కూడా ఇలాంటి రివ్యూలే వ‌చ్చాయి. ఇందే సినిమా ? రొటీన్ సినిమా అంటూ విమ‌ర్శించారు.

క‌ట్ చేస్తే ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. భారీ వసూళ్లు తెచ్చిన చిత్రంగా నిలిచింది. ఆ నమ్మ‌కంతోనే తార‌క్ మ‌రోసారి కొర‌టాల శివ‌కి అవ‌కాశం ఇచ్చాడు. అయితే తార‌క్ కంటే ముందు మ‌హేష్ కూడా కాల‌రె గ‌రేసాడు. అయితే మ‌హేష్ కాల‌రెగ‌రేసింది హిట్ కొట్టిన త‌ర్వాత‌. హిట్ కొట్ట‌క‌ముందు ఈ మాట అన‌లేదు. సినిమా రిలీజ్ అనంత‌రం బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన త‌ర్వాత ఏర్పాటు చేసిన విజయోత్స‌వ స‌భ‌లో ప‌సుపు రంగు టీష‌ర్ట్ కాల‌రెగ‌రేసి హిట్ కొట్టాన‌ని ఎంతో గ‌ర్వంగా చెప్పాడు మ‌హేష్‌.

అప్ప‌ట్లో ఆ వీడియో వైర‌ల్ అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అలా కాల‌రెగ‌రేసింది తార‌క్. ఇక వీరిద్ద‌రు ఎంత క్లోజ్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ ని తార‌క్ అన్నా అంటూ ఎంతో అభిమానంతో పిలుస్తాడు. ఇరువురు ఒక‌రి సినిమా ఈవెంట్ల‌కు మ‌రొక‌రు అతిధిగానూ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే.