Begin typing your search above and press return to search.

ర‌ష్మిక త‌ర్వాత ఈ అమ్మ‌డికే ఆ ఛాన్స్!

కానీ ఈ అమ్మ‌డికి కొన్ని వ‌రుస ఫ్లాపులు త‌గ‌ల‌డంతో మ‌ళ్లీ డ‌ల్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   17 Jan 2024 3:30 AM GMT
ర‌ష్మిక త‌ర్వాత ఈ అమ్మ‌డికే ఆ ఛాన్స్!
X

కెరీర్ ప్రారంభించిన కేవ‌లం ఐదేళ్ల‌కే స్టార్ హీరోయిన్ గా అవ‌త‌రించింది ర‌ష్మిక మంద‌న‌. ల‌క్ అంటే ఈ అమ్మ‌డిదే. కేవ‌లం నాలుగైదు చిత్రాల‌తోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ భామ త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో భారీ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. క‌న్న‌డ రంగం నుంచి వ‌చ్చిన నిధి అగ‌ర్వాల్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉన్నా కానీ, అదే స‌మ‌యంలో ర‌ష్మిక స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా దూసుకుపోయింది.


ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో క‌న్న‌డ అమ్మాయి కృతి శెట్టి పేరు మార్మోగింది. కానీ ఈ అమ్మ‌డికి కొన్ని వ‌రుస ఫ్లాపులు త‌గ‌ల‌డంతో మ‌ళ్లీ డ‌ల్ అయిపోయింది. ఇంత‌లోనే ఇప్పుడు మ‌ళ్లీ క‌న్న‌డ నుంచి వ‌చ్చి తెలుగు వారి మ‌నసులు దోచేసిన బ్యూటీ ఆశికా రంగనాథ్. కెరీర్‌లో నా సామి రంగ భారీ ప్రాజెక్ట్. యువ నటి ప్రోమోలలో అందంగా కనిపించింది. ట్రైల‌ర్ లో త‌న అందం న‌ట‌నాభిన‌యం ఎంత‌గానో న‌చ్చేసాయి. నాగార్జున తన అన్ని ఇంటర్వ్యూలలో తెలుగులో పెద్ద కెరీర్ ఉన్న అమ్మాయి అంటూ కితాబిచ్చేసారు కూడా.

ఇక నా సామి రంగా చిత్రం సంక్రాంతి బ‌రిలో హిట్ మూవీగా నిల‌వ‌డంలో నాగార్జున‌తో పాటు ఆషికా రంగ‌నాథ్ న‌ట‌న‌, అంద‌చందాలు కూడా ప్ర‌ధాన పాత్ర పోషించాయ‌ని అంద‌రూ న‌మ్ముతున్నారు. ముఖ్యంగా ఈ బ్యూటీ చీర క‌ట్టు, లంగా ఓణీల్లో అద‌ర‌గొట్టేసింది. కొన్ని స‌న్నివేశాల్లో మ‌న్మ‌ధుడు నాగార్జున‌నే డామినేట్ చేసేసింద‌నే టాక్ వ‌చ్చింది. ఈ చిత్రంలో వరాలు పాత్రను పోషించిన ఆషిక త‌న పేరుకు త‌గ్గ‌ట్టే ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయి న‌టించింది. విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషించారు. కింగ్ చెప్పిన‌ట్టే ఆషిక‌కు తెలుగులో మంచి భ‌విష్య‌త్ ఉంది. నా సామి రంగా రూపంలో మ‌రో అందాల న‌టి మ‌న‌కు ల‌భించింది.