Begin typing your search above and press return to search.

ఏజెంట్ పంచాయితీ.. మరో తలనొప్పి!

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని

By:  Tupaki Desk   |   17 Sep 2023 5:22 AM GMT
ఏజెంట్ పంచాయితీ.. మరో తలనొప్పి!
X

'భోళా శంకర్' సినిమా నిర్మాతలు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్​కు చెందిన అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, గరికపాటి కిషోర్​పై హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టులో చీటింగ్​తో పాటు వివిధ కేసులు రిజిస్టర్​ అయినట్లు తెలుస్తోంది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని.. భోళాశంకర్​ రిలీజ్​ సమయంలో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్​ సతీశ్​ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. అప్పుడా కేసు సిటీ సివల్ కోర్టులో నడిచింది. ఇప్పుడది నాంపల్లి క్రిమినల్ కోర్టుకు చేరింది.

ఈ విషయాన్ని సతీశ్ తెలిపారు. ఏజెంట్​ సినిమా సమయంలో తాను చెల్లించిన రూ.30కోట్లను రికవరీ చేసుకునేందుకు సూట్​ ఫైల్ చేసుకోమని హైదరాబాద్​ సివిల్ కోర్టు అనుమతిచ్చిందని చెప్పారు. ఆ మేరకు తాను న్యాయ పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నాంపల్లి క్రిమినల్ కోర్టులో సదరు నిర్మాతలపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని అన్నారు. కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ అయినట్లు వెల్లడించారు.

ఏజెంట్​ సినిమాకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల హక్కుల కోసం రూ. 30 కోట్ల రూపాయలను బ్యాంకు ద్వారా తాను చెల్లించినా.. తనను కేవలం విశాఖపట్నం వరకే పరిమితం చేశారంటూ సతీశ్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం నిర్మాతలను సంప్రదించగా, తనను పట్టించుకోకుండా పక్కనపెట్టారని.. ఆ తర్వాత భోళా శంకర్ రిలీజ్​కు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చి మాట తప్పారని అంటున్నారు.

అందుకే తన డబ్బుల రికవరీ కోసం అప్పుడు హైదరాబాద్​ సివిల్​ కోర్టును ఆశ్రయించారు సతీశ్. భోళాశంకర్ రిలీజ్ ఆపేయాలని కూడా కోరారు. కానీ అది జరగలేదు. మరోవైపు అనిల్ సుంకర కూడా సినిమా రిలీజ్​ అయ్యేలా చేసుకుని వచ్చిన కలెక్షన్లతో సతీశ్ డబ్బులను సర్దుబాటు చేయాలని అనుకున్నారు. కానీ అంచనాలు తప్పాయి.

భోళాశంకర్ రిలీజై భారీ డిజాస్టర్​గా నిలిచింది. దీంతో అనిల్ సుంకర మరింత నష్టాల్లోకి వెళ్లిపోయారు. సతీశ్ డబ్బులను ఇవ్వలేకపోయారు. అందులో నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యాయ పోరాట కొనసాగిస్తున్న సతీశ్​ను.. సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చిందని తెలిసింది. సతీశ్​.. నాంపల్లి క్రిమినల్​ కోర్టులో కూడా కేసు వేశారు.