అఘత్యా ట్రైలర్: ఏంజెల్స్ కథలో అంతుచిక్కని రహస్యం
అతను నటించిన అఘత్యా సినిమా, టీజర్ విడుదలైనప్పటి నుంచి మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
By: Tupaki Desk | 11 Feb 2025 1:08 PM GMTఈమధ్య కాలంలో మిస్టరీ హారర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. యువ హీరోలు మాస్ లవ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి అప్పుడప్పుడు హారర్ కథలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు రంగం ఫేమ జీవా కూడా అదే ట్రాక్ లో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. అతను నటించిన అఘత్యా సినిమా, టీజర్ విడుదలైనప్పటి నుంచి మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
యాక్షన్ కింగ్ అర్జున్, రాశీ ఖన్నా కూడా ఇందులో భాగమవ్వడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విభిన్నమైన కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఇక మేకర్స్ తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఫిబ్రవరి 28న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే ట్రెండ్ అవుతోంది.
ట్రైలర్ కథాంశాన్ని చూస్తే, జీవా ఓ భయానకమైన ప్రదేశంలోకి ప్రవేశించడంతో.. ఆ ప్రదేశం దశాబ్దాలుగా ఆత్మల నివాసంగా ఉందన్న ప్రచారం ఉంటుంది. జీవా తన పాత్ర ద్వారా ఆ భవంతి గతాన్ని, వర్తమానాన్ని అన్వేషించడానికి ప్రయాణం చేస్తాడు. అతని అన్వేషణలో అర్జున్ పాత్రకు, అతనికి మధ్య కొన్ని సంబంధాలు ఉంటాయని తెలుస్తోంది. గతం, వర్తమానం కలిసిపోయేలా ఉండే ఈ కథ ఉత్కంఠను కలిగించేలా ఉంది.
ఇప్పటి వరకు వచ్చిన అంచనాలను మించిపోయేలా ట్రైలర్‌లో విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. కథలో ప్రధానమైన పోరాటం ఏంజెల్స్, ఆత్మల మధ్య జరిగేలా కనిపిస్తోంది. అయితే ఇందులో కీలకమైన అంశం సంగీతమనే పాయింట్ కావడం ఆసక్తికరంగా మారింది. మ్యూజిక్ నోట్స్ ఈ కథలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ట్రైలర్‌లో హింట్ ఇచ్చారు. ట్రైలర్ ఎడిటింగ్ నుంచి తీసిన ప్రతి షాట్ వరకు అన్ని వివరాలను ఎంతో బాగా ప్రదర్శించారు.
ఇందులో జీవా నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అర్జున్ పాత్ర కూడా పూర్తి మిస్టీరియస్‌గా ఉండేలా డిజైన్ చేశారు. ప్రొడక్షన్ విలువలు హై స్టాండర్డ్‌లో ఉండేలా మేకర్స్ కష్టపడ్డారనిపిస్తోంది. భారీ స్థాయిలో ప్లాన్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ మరింత రిచ్‌గా కనిపించేలా చేశారు. యూవన్ శంకర్ రాజా అందించిన సంగీతం సినిమాకు అసలు మేజిక్ పాయింట్‌గా నిలవనుంది.
ఈ చిత్రాన్ని డాక్టర్ ఇషారి గణేష్, అనీష్ అర్జున్ దేవ్ సంయుక్తంగా నిర్మించగా, పా. విజయ్ దర్శకత్వం వహించారు. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ టెక్నిక్స్ అన్ని కూడా హై రేంజ్ లో ఉన్నాయని ఇప్పటికే సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఓ కొత్త జానర్‌కు తెర తీసేలా ఉందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇక ఫ్8ఫిబ్రవరి 28న రాబోతున్న అఘత్యా సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.