'ఆహా' మైథలాజికల్ 'చిరంజీవ'.. అప్పుడే ఓ రేంజ్ లో..
మైథలాజికల్ జోనర్ లో సినిమాలు, వెబ్ సిరీసులు కొంతకాలంగా ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Nov 2024 10:18 AM GMTమైథలాజికల్ జోనర్ లో సినిమాలు, వెబ్ సిరీసులు కొంతకాలంగా ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. భారత పురాణాలతో పాటు ఇతిహాసాలపై అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో దర్శక నిర్మాతలు, ఓటీటీ నిర్వాహకులు ఆ జోనర్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్లి విభిన్నమైన అనుభూతిని కలిగించే మైథాలాజికల్ థ్రిల్లర్స్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. మంచి హిట్స్ ను అందుకుంటున్నారు.
త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కూడా సరికొత్త మైథలాజికల్ వెబ్ సిరీస్ ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవ పేరుతో సిరీస్ ను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఆహా. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అందులో ఒక ఎద్దు శివ నామాలతో పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. రోడ్డుపై నడుస్తున్న యువకుడిని వెనుక నుంచి చూపించారు. టైటిల్ చిరంజీవలో మధ్య అక్షరంపై ఎద్దు కొమ్ములను కిరీటంగా డిజైన్ చేశారు. దీంతో ఆహా ఒరిజనల్ వెబ్ సిరీస్ చిరంజీవ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.
సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వెయిటింగ్ ఫర్ వెబ్ సిరీస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే చిరంజీవ సిరీస్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో కచ్చితంగా అలరిస్తుందని ఆహా టీమ్ హామీ ఇస్తోంది. అద్భుతమైన విజువల్స్ తో ఆడియన్స్ కు మంచి అనుభూతిని అందించడమే తమ లక్ష్యంగా చెబుతోంది. ప్రేక్షకులను సరికొత్త మైథలాజికల్ వరల్డ్ లోకి తీసుకెళ్లనున్నామని పేర్కొంటోంది. దీంతో ఇప్పటి నుంచే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
చిరంజీవ వెబ్ సిరీస్ రచన, దర్శకత్వ బాధ్యతలను అభినయ కృష్ణ వహిస్తున్నారు. ఏ రాహుల్ యాదవ్, సుహాసిని రిచ్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 డిసెంబర్ లో సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా నిర్వాహకులు ఇప్పటికే తెలిపారు. గేమ్ చేంజింగ్ వెబ్ సిరీస్ గా చిరంజీవ రూపొందుతోందని చెప్పారు. త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీసులతో పాటు టాక్ షో, కామెడీ షోలతో అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు చిరంజీవతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.