రియల్ లైఫ్ లో అమ్మాయిల్ని క్షమించని హీరో!
ఎంతటి ట్యాలెంటెడ్ నటుడో? అంతకు మించి ఎఫైర్ల విషయంలోనూ ఘనాపాటి అని పేరు సంపాదించిన నటుడు.
By: Tupaki Desk | 14 Feb 2024 12:30 PM GMTచాక్లెట్ బోయ్ రణబీర్ కపూర్ రొమాంటిక్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అలియాభట్ తో పెళ్లికి ముందు రణబీర్ పేరు ఏఫైర్ల విషయంలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యేదో తెలిసిందే. ఎంతటి ట్యాలెంటెడ్ నటుడో? అంతకు మించి ఎఫైర్ల విషయంలోనూ ఘనాపాటి అని పేరు సంపాదించిన నటుడు. రణబీర్ ఖాతాలో గాళ్స్ లిస్ట్ తీస్తే చాలా పెద్దదే ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత రణబీర్ లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.
అలియాభట్ తో జీవితాన్ని పంచుకున్న తర్వాత రణబీర్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడా జంటకి ఓ అందమైన పాప కూడా ఉంది. మరి ఈ హీరో స్కూల్..కాలేజీ రోజుల్లో ఎలా ఉండాడో? అడిగితే చాలా సంగ తులే రివీల్ చేసాడు. చదుకుంటున్న రోజుల్లో ప్రేమ లేఖలు రాయడంలో తనని మించిన వారు ఎవరూ లేరు అంటున్నాడు. తన ప్రేమలేఖ అందుకోని అమ్మాయి అంటూ లేదనేసాడు.
అయితే అవన్నీ ప్రేమ లేఖలు కాదని...స్నేహ పూర్వకంగా చాలా మందికి రాసిన ఉత్తరాలే ఎక్కువగా ఉంటాయన్నాడు. వాటిలో అమ్మనాన్నలకు ..తాత నాయనమ్మలకు రాసిన ప్రేమ లేఖలు కుప్పలుగా ఉన్నాయట. అలాగే తాత-తాతమ్మలు ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేసుకుంటూ రాసిన ఎన్నో లేఖల్ని సీక్రెట్ గా చదివేవాడుట. అప్పట్లో ప్రేమ ఎంతో స్వచ్ఛంగా కనిపించేదని.. ఒకరిపై ఒకరికి ఎంతో శ్రద్ద ఉండేదని అన్నాడు.
అయితే ఇప్పుడు ప్రేమలో అలాంటివి లేవు అనేసాడు. `కానీ నిజంగా ఉత్తరాలకు ఉన్న విలువ వేరు. అందుకే అలియాభట్ తన కుమార్తె పేరు మీద ఓ ఐడీ క్రియేట్ చేసి రోజుకో ఉత్తరం రాసే అలవాటు చేసాను. అప్పుడప్పుడు నేను కూడా ఆ పని చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నా పాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తున్నాయి` అన్నాడు. ఇటీవలే రణబీర్ యానిమల్ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈసినిమాతో తెలుగులో ఫేమస్ అయిపోయాడు.