17 ఏళ్లలో ఒక్క హిట్టూ లేని స్టార్ హీరో
నిజానికి అతడు ఈ 17ఏళ్లలో సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేదు.
By: Tupaki Desk | 11 March 2024 4:30 PM GMTకొన్ని లెక్కలు విచిత్రంగా ఉంటాయి. అతడు హిట్టు కొట్టాడు అని చెబుతున్నా రియల్ గా అది అతడి ఖాతాలోనిది కాదు. ఇది నాది అని చెప్పుకునే ధైర్యం ఆసక్తి కూడా అతడికి ఉండదు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు చియాన్ విక్రమ్. నిజానికి అతడు ఈ 17ఏళ్లలో సరైన బ్లాక్ బస్టర్ ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేదు. డీలెయిట్స్ లోకెళితే...
అన్నియన్ తర్వాత తమిళ నటుడు విక్రమ్ హిట్ కొట్టాడా? అంటే అది ఇప్పటికీ సందేహమే. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, పంపిణీదారులు ఇలా అన్ని వర్గాలు లాభాలు అందుకుంటేనే హిట్ అని చెప్పగలం. దీనిని సర్టిఫైడ్ హిట్ అని అనాలి.
ఈ రోజుల్లో - OTT శాటిలైట్ కారణంగా - చాలా మంది నిర్మాతలు ఎల్లప్పుడూ లాభాన్ని ప్రకటించే స్థితికి చేరుకున్నారు కాబట్టి ఇకపై నిర్మాతలను పరిగణనలోకి తీసుకోకూడదు. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఇది హిట్టు అని చెబితేనే దానిని నమ్మాల్సిన పరిస్థితి ఉంది. పైకి నిర్మాతలు తమ సినిమా గొప్ప హిట్టు అని ఆర్భాటం చేసినా కానీ నిజానికి అది పంపిణీదారులు, బయ్యర్లలో హిట్టు కానేకాదు. వారు స్వయంగా దానిని ప్రకటిస్తేనే హిట్టు.
ఎగ్జిబిటర్లందరూ సినిమా లాభదాయకంగా ఉందని స్పష్టంగా చెబితే .. డిస్ట్రిబ్యూటర్లు దానిని ధృవీకరించినట్లయితే - సినిమా సర్టిఫికేట్ హిట్ అని డిక్లేర్ చేయాలి. అలా చూస్తే 'అన్నియన్'(తెలుగులో అపరిచితుడు) ఒక్కటే నిజానికి విక్రమ్ నటించిన చివరి సర్టిఫైడ్ హిట్.
చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ 'ఐ' లేదా 'స్కెచ్' లేదా 'ఇరు ముగన్' వంటి సినిమాలు సూపర్‌హిట్‌లని వాదిస్తుంటారు. అయితే ఈ సినిమాల వల్ల చాలా మంది డబ్బు పోగొట్టుకున్నందున ఇవేవీ సర్టిఫైడ్ హిట్‌లుగా పరిగణించకూడదు. ఇవన్నీ డబ్బింగ్ అయి తెలుగులో విడుదలైనా కానీ ఇక్కడా సరిగా ఆడలేదు.
COBRA - PS1 లాంటి సినిమాలు విజయాలు సాధించాయని చెబుతారు. కానీ పీఎస్ 1 క్రెడిట్ విక్రమ్ ఖాతాలో లేదు. ఏదేమైనా కానీ ఈ ట్రెండ్‌ని బ్రేక్ చేసి 17 ఏళ్లలో విక్రమ్ మొదటి హిట్ అందుకోవాలని ఆశిద్దాం. తదుపరి విక్రమ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం స్టూడియోగ్రీన్ సంస్థలో తెరకెక్కుతోంది. ఇది అతడి కెరీర్ కి ఊరటనిస్తుందేమో చూడాలి.