Begin typing your search above and press return to search.

వేశాలు రావ‌ని కేన్స‌ర్ విష‌యాన్ని దాచిపెట్టిన న‌టుడు!

ఆయనకి కేన్సర్ వచ్చిన విషయం కూడా చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వేషాలు రావడం కష్టం.

By:  Tupaki Desk   |   21 Dec 2023 12:30 AM GMT
వేశాలు రావ‌ని కేన్స‌ర్ విష‌యాన్ని దాచిపెట్టిన న‌టుడు!
X

దివంగ‌త సీనియ‌ర్ న‌టుడు ఆహుతి ప్ర‌సాద్ సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 150పైగా చిత్రాల్లో న‌టించిన న‌టుడాయ‌న‌. త‌మిళ‌..హిందీ భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేసారు. వెండి తెర‌పై న‌టుడిగా చెర‌గ‌ని ముద్ర వేసారు. హాస్య పాత్ర‌ల‌తోపాటు ప్ర‌తి నాయ‌కుడిగా పాత్ర‌ల్లోనూ గొప్ప పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కామెడీ పాత్ర‌ల‌కు ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి.


నేటి త‌రం జ‌న‌రేష‌న్ లో న‌టుడిగా ఆయ‌న స్థాయిని పెంచిన పాత్ర‌లు అవే. అలా న‌టిస్తూనే అకాల మ‌ర‌ణం పొందారు. మ‌హ‌మ్మారి కేన్స‌ర్ బారిన ప‌డి స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. అయితే ఆహుతి ప్ర‌సాద్ కేన్స‌ర్ బారిన ప‌డిన‌ట్లు పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఆయ‌న కుమారుడు కార్తీక్ ప్ర‌సాద్ తాజాగా ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసాడు. ఆ విష‌యాన్ని త‌న తండ్రి దాచిపెట్ట‌డానికి ఓ ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఉందంటున్నాడు.

ఆ సంగ‌తులేంటే కార్తీక్ మాట‌ల్లోనే.. 'నాన్న కేన్సర్ తో పోయారు .. ఆయనకి కేన్సర్ వచ్చిన విషయం కూడా చాలా కాలం పాటు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వేషాలు రావడం కష్టం. కొంతమంది సానుభూతిని చూపించినా.. మరికొంతమంది చులకనగా చూస్తారు. అలా చూడటం నాన్నకి ఇష్టం ఉండదు. అందువలన ఆయన తన పనిని తాను అలా చేస్తూనే వెళ్లారు. చివరి రోజుల్లో నాన్న సొంత ఊరుకి వెళ్లాలనుకున్నారు.

అక్కడ ఇంటిని కూడా బాగు చేయించాము. అంతలోనే ఆయన క‌న్ను మూసారు. అందరితో కలివిడిగా ఉండటం వలన ప‌రిశ్ర‌మ‌ నుంచి చాలామంది వచ్చారు. ఇక నా విషయానికి వస్తే నేను పైలెట్ గా కొంతకాలం పనిచేశాను. ఆ తరువాతనే సినిమాల దిశగా వచ్చాను. 'టక్ జగదీశ్' .. 'మసూద' వంటి సినిమాలు మంచి పేరును తీసుకొచ్చాయి. న‌టుడిగా మంచి అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నాను' అని అన్నాడు.