స్పిరిట్.. ప్రభాస్ ఇలా ఉంటే అరాచకమే..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనే కాదు అభిమానులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 11 Dec 2024 6:31 AM GMTప్రభాస్ ప్రతీ సినిమాతో కూడా పాన్ ఇండియా స్టార్‌గా తన క్రేజ్‌ని మరో స్థాయికి తీసుకువెళుతున్నాడు. ప్రస్తుతం ఏ హీరోకు లేనంత స్టార్ లైనప్ ఆయన సొంతం. నెవ్వర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ త్వరలో స్టార్ట్ చేయబోయే కొత్త సినిమా ‘స్పిరిట్’ గురించి భారీ ఆసక్తి నెలకొంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనే కాదు అభిమానులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పిక్‌ను ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారు. ప్రభాస్ పోలీస్ యూనిఫార్మ్‌లో సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఆ ఫోటో చూసిన మరికొందరు అభిమానులు ‘స్పిరిట్’లో ఆయన లుక్ ఇదేనా? అని ఆశగా అడుగుతున్నారు. ఈ ఫోటోలో ప్రభాస్ స్టైలిష్ లుక్, పవర్ఫుల్ అటిట్యూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత వైరల్ చేసేస్తున్నారు.
ఏదేమైనా వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఇలా కనిపిస్తే మాత్రం అరాచకమే అనేలా కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ అనేక ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ది రాజా సాబ్’, ‘సలార్ పార్ట్ 2’, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ‘స్పిరిట్’ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇది ప్రభాస్ మొదటి పోలీస్ రోల్ కావడంతో ఆ పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.
స్పిరిట్ గురించి ఇదివరకే వచ్చిన సమాచారం మేరకు, ఇది ఒక పవర్ఫుల్ కథతో, పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో సంబంధం ఉన్న కథాంశంతో ఉంటుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడా భారీ అంచనాలు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.
ఈ సినిమా చిత్రీకరణ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ, ప్రభాస్ లుక్ కోసం సోషల్ మీడియాలో అభిమానులు అంచనాలు పెంచుకుంటూ వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ లుక్‌లో కనిపిస్తే, ఆయనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మరింత ఆదరణ లభించనుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక ‘స్పిరిట్’లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల అవుతుందా? అని అందరూ ఎదురు చూస్తున్నారు.