టెక్ సాయం: AIతో 68 నుంచి 28 కి మారిన కట్టప్ప
తమ చిత్రం లో కీలకమైన యానిమేషన్ సన్నివేశాన్ని రూపొందించడానికి AIని ఉపయోగిస్తున్నారని తెలిసింది.
By: Tupaki Desk | 31 July 2023 4:11 AM GMTతమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ పరిచయం అవసరం లేదు. బాహుబలి కట్టప్పగా అందరికీ సుపరిచితుడు. ఇటు దక్షిణాది అటు ఉత్తరాది రెండు చోట్లా కట్టప్పగా గొప్ప పాపులారిటీని దక్కించుకున్నాడు సత్యరాజ్. అయితే ఆయన నిజ వయసు 68. కానీ సినిమా లో పాత్ర కోసం 28 ఏజ్ కి తగ్గించాలంటే ఏం చేయాలి? దీనికోసం ప్రముఖ తమిళ దర్శకుడు అధునాతన సాంకేతికత ను ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఆయనకు తొలిగా ఈ ఆలోచన రాగానే AI యాంకర్లు గుర్తుకు వచ్చారట. ఏఐ టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే గనుక ఇప్పుడు సత్యారాజ్ ని వయసు తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నామని అతడు తెలిపారు. సత్యరాజ్, వసంత్ రవి, రాజీవ్ మీనన్ నటించిన తమిళ చిత్రం 'వెపన్' దర్శకనిర్మాతలు తమ చిత్రం లో కీలకమైన యానిమేషన్ సన్నివేశాన్ని రూపొందించడానికి AIని ఉపయోగిస్తున్నారని తెలిసింది.
చిత్ర దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ ఈ చిత్రాన్ని 'అతీంద్రియ శక్తుల తో నడిచే కథ'గా అభివర్ణిస్తూ .. సత్యరాజ్ సార్ సూపర్ పవర్స్ ఉన్న పాత్రలో నటించారని తెలిపారు. ఈ పాత్ర తన సూపర్ పవర్స్‌ను ఎలా పొందిందో వివరించే సన్నివేశాల క్రమం తెర పై చూపాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మేము AIని ఉపయోగించాం. సత్యరాజ్ చిన్న వయసు రూపాన్ని తెచ్చేందుకు సాంకేతికతతో ప్రయత్నించాం. గతం లో జరిగిన సంఘటనలు ఎలా జరిగాయో చిన్నవయసు పాత్రతో తెరపై చూపిస్తున్నాం అని తెలిపారు.
సాధారణంగా దర్శకనిర్మాతలు ఇటువంటి సన్నివేశాల ను రూపొందించడానికి సాంప్రదాయ యానిమేటర్‌లను సంప్రదిస్తారు. అయితే మేం దాని కోసం AIని ఉపయోగించామని వెల్లడించారు. ఇటీవల మనమంతా సోషల్ మీడియా లో AI- రూపొందించిన చాలా ఫోటోలను చూస్తున్నాము. అవి అద్భుతంగా కనిపిస్తున్నాయి. AI మనకు కావలసినదాన్ని అందించగలదు. కానీ ఇది ప్రస్తుతానికి ట్రయల్ ఎర్రర్‌ను కలిగి ఉంటుంది. మా దగ్గర ఆర్టిస్టులు లొకేషన్‌ల ఫుటేజ్ ఉన్నందున ఎఐ సాంకేతికతతో పని మాకు తేలికైంది కానీ ఇందులోను కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయని తెలిపారు.
ఈ AI సీక్వెన్స్ కోసం ఐదుగురు నిపుణులు మాతో కలిసి పని చేసారు. మేము AI ప్లగిన్‌తో ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించాము. 3D ఇమేజ్ లను రూపొందించాము. మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ వన్ వంటి చిత్రాలు AIని ఉపయోగించినప్పటికీ భారతీయ సినీపరిశ్రమల్లో ఇది మొదటి ప్రయత్నం అని భావిస్తున్నాం" అని నిర్మాత MS మంజూర్ చెప్పారు. ప్రస్తుతానికి భారతీయ ముఖాల తో పాత్రల ను సృష్టించడం ఒక సవాల్.. సందర్భానికి తగ్గ పాత్రలను సృష్టించే విషయం లో AI ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని గుహన్ అన్నారు.
ప్రస్తుతం AI యూరోపియన్లు లేదా అమెరికన్‌ల ను రూపొందించే విధంగా భారతీయ పాత్రలకు కావలసిన స్కిన్ టోన్‌లను తక్షణమే సృష్టించగల స్థాయికి చేరుకోలేదు. భారతదేశానికి చెందిన ఒక గిరిజనుడిని తయారు చేయమని మనం AI ని అడిగితే.. అది ఆసియా మొత్తానికి తటస్థంగా ఉంటుంది. దానివల్ల అచ్చుగుద్దినట్టు భారతీయ రూపాల ను ఈ సాంకేతికతతో పొందలేమని అన్నారు. బ్యాక్‌డ్రాప్‌లు, స్కిన్ టోన్‌లు మొదలైనవాటికి సంబంధించి ఏఐలో చాలా పాశ్చాత్య దృక్పథం ఉందని... నేటివిటీని తీసుకురావడం ఇంకా సవాల్ గానే ఉందని ఆయన తన పరిశీలనను సవివరంగా చెప్పారు.