జిమ్‌లో కర్వులు చూపిస్తూ యంగ్ హీరోయిన్ ఫికర్
ఇక ఇన్ స్టాలో నిరంతరం వేడెక్కించే హా* ఫోటోషూట్లను షేర్ చేసే ఐషా శర్మ.. బికినీలో బాడీ హగ్గింగ్ దుస్తుల్లో అందాలను ఆరబోయడంలో వెనకాడదు.
By: Tupaki Desk | 24 Nov 2024 6:06 AM GMTశర్మా సిస్టర్స్ లో ఐషా శర్మ ఎంతో చురుకైన ఫిట్ నెస్ ఫ్రీక్. నటి కం మోడల్‌గా ఫిలింసర్కిల్స్ లో పాపులరైంది. ఐషా మొదట ఆయుష్మాన్ ఖురానా `ఐక్ వారి మ్యూజిక్..` వీడియోలో నటించింది. ఆ తర్వాత హిందీ యాక్షన్ థ్రిల్లర్ `సత్యమేవ జయతే`లో జాన్ అబ్రహం, మనోజ్ బాజ్‌పాయ్ లాంటి ప్రతిభావంతులైన స్టార్లతో అవకాశం అందుకుంది. కానీ ఈ బ్యూటీ కెరీర్ ఆశించిన రేంజుకు చేరుకోలేదు. తన సోదరి నేహా శర్మతో కలిసి `షైనింగ్ విత్ ది శర్మాస్` అనే వెబ్ షోతోను అలరించింది. ఇక ఇన్ స్టాలో నిరంతరం వేడెక్కించే హా* ఫోటోషూట్లను షేర్ చేసే ఐషా శర్మ.. బికినీలో బాడీ హగ్గింగ్ దుస్తుల్లో అందాలను ఆరబోయడంలో వెనకాడదు. ఈ భామ బోల్డ్ ఫోటోషూట్లకు బోలెడంత గిరాకీ ఉంది. లక్షల్లో ఫాలోవర్స్ ఇన్ స్టాలో తనను అనుసరిస్తుండగా, ఈ వేదికపై కొన్ని వాణిజ్య ప్రకటనలను ఐషా షేర్ చేస్తోంది. తన సోదరితో కలిసి ప్రకటనల్లో నటించడం ద్వారా బాగానే ఆర్జిస్తోంది.
అదంతా అటుంచితే తాజాగా ఐషా శర్మ షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
సానుకూల జీవితాన్ని ఆస్వాధించడానికి ఐషా శర్మ `ఇన్‌స్టంట్ మూడ్ లిఫ్టర్స్` గురించి కొన్నిటిని సూచించింది. ఈ వారాంతంలో తన ఆరోగ్యం, మానసిక చికిత్సకు ప్రాధాన్యతనిస్తూ జిమ్‌లో ఎక్కువ సమయం గడిపింది. తన `ఇన్‌స్టంట్ మూడ్ లిఫ్టర్స్` ఏమిటో వివరిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఐషా. అంతేకాదు.. ఈ యంగ్ బ్యూటీ స్వీయానుభవం నుంచి ఇతరులు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
వర్కౌట్ లకు సహకరించేలా ఫ్లెక్సిబుల్ స్పోర్ట్స్ బ్రాలెట్.. బాడీ హగింగ్ డ్యూరబుల్ వస్త్రాలను ధరించిన ఐషా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. కేవలం వర్కౌట్ ల కోసం తయారు చేసిన దుస్తులివి... వర్కౌట్ చేయకూడదనుకునేవారిలోను ఉత్సాహాన్ని పెంచే దుస్తులివి...
ఐషా వర్కవుట్లతో పాటు తన ఆలోచనలను కాగితంపై ఉంచి, `కృతజ్ఞతా జర్నలింగ్` అని తెలిపింది. కాఫీ సేవిస్తే అది మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని ఐషా తెలిపింది. అలాగే సంగీతం వినాలి. జాన్ మేయర్ రాసిన లవ్ ఈజ్ ఎ వెర్బ్ ట్యూన్‌లకు ప్రాక్టీస్ చేస్తే.. అది మీ సెరెనేడింగ్‌ను ఏ సమయంలోనైనా మంచి వైబ్‌లకు అందజేస్తుంది.
ఐషా శర్మ `ఇన్‌స్టంట్ మూడ్ లిఫ్టర్` కార్యకలాపాలు ఈ వారాంతంలో స్వీయ-సంరక్షణను, వెల్నెస్ స్ఫూర్తిని అందిస్తాయి.