Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : మిర్రర్‌ సెల్ఫీలో ఐషా పాప అదుర్స్‌

ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇప్పటికీ వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   25 Feb 2025 10:13 AM GMT
పిక్‌టాక్‌ : మిర్రర్‌ సెల్ఫీలో ఐషా పాప అదుర్స్‌
X

టాలీవుడ్‌ ప్రేక్షకులకు నేహా శర్మని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. టాలీవుడ్‌లో రామ్‌ చరణ్ మూవీ చిరుతతో ఎంట్రీ ఇచ్చింది. రామ్‌ చరణ్‌తో ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కించుకుని, మొదటి సినిమాతో హిట్‌ దక్కించుకున్నా నేహా శర్మకు టాలీవుడ్‌లో కాలం కలిసి రాలేదు. దాంతో తక్కువ సమయంకే టాలీవుడ్‌లో కనుమరుగు అయింది. అయితే బాలీవుడ్‌లో ఈ అమ్మడికి కాలం కలిసి వచ్చినట్లు ఉంది. అందుకే టాలీవుడ్‌లో దక్కని ఆఫర్లు బాలీవుడ్‌లో దక్కాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇప్పటికీ వరుసగా సినిమాలను చేస్తూనే ఉంది. ఇదే సమయంలో ఆమె సోదరి ఐషా శర్మ సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తుంది.


ఐషా శర్మ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈమె స్టార్స్ హీరోయిన్స్ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆరు మిలియన్‌లకు పైగా ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఐషా శర్మ రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈసారి ఈ అమ్మడు తన బాలీ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. ఇండోనేషియాలోని బాలికి హాలీడే ట్రిప్‌కి వెళ్లిన ఐషా ఇలా మిర్రర్‌ సెల్ఫీతో కన్నుల విందు చేసింది. మిర్రర్‌ ముందు నిల్చుని తన అందంను తానే క్లిక్‌ అనిపించింది. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఈ ఫోటోలకు తక్కువ సమయంలోనే వేలల్లో లైక్స్‌, కామెంట్స్ దక్కాయి.


ఇంత అందంగా ఉన్న ఐషా శర్మ ఎందుకు ఇప్పటి వరకు హీరోయిన్‌గా బిజీ కావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఫోటోలు, ఇంత అందమైన ఫోటోలు షేర్‌ చేసిన సమయంలో కచ్చితంగా ఫిల్మ్‌ మేకర్స్ ఏదో ఒక సినిమాకు సంప్రదించే అవకాశాలు ఉంటాయి. కానీ ఐషా మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఐషాను వెండి తెరపై ఎప్పుడు చూస్తామా అంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెను ఫాలో అవుతున్నారు, ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


అక్కకు ఏమాత్రం తగ్గకుండా స్కిన్‌ షో చేయడం మాత్రమే కాకుండా అక్క కంటే కూడా ఎక్కువగా అందంగా ఐషా కనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఐషాకి ఉన్న ఆధరణ నేపథ్యంలో సినిమాల్లో ఎంట్రీ ఇస్తే కచ్చితంగా పెద్ద స్టార్‌గా మారుతుందని కొందరు అంటున్నారు. ఇలాంటి అందాల ఆరబోత చేసే హీరోయిన్స్‌కి బాలీవుడ్‌లో డిమాండ్‌ ఉంది. ఇలా నడుము, నాభి అందంను అందంగా చూపించడంతో మంచి నటనతో మెప్పిస్తే బాలీవుడ్‌తో పాటు సౌత్‌లోనూ హీరోయిన్‌గా నటించే అవకాశాలు మరిన్ని తెచ్చుకుంటుందేమో చూడాలి.