Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : అందాల ఐషా శర్మ ఉమెన్స్‌ డే స్పెషల్‌

మరో వైపు నేహా శర్మ సోదరి ఐషా శర్మ సైతం సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తుంది.

By:  Tupaki Desk   |   9 March 2025 4:00 AM IST
పిక్‌ టాక్ : అందాల ఐషా శర్మ ఉమెన్స్‌ డే స్పెషల్‌
X

రామ్‌ చరణ్‌తో పాటు చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. తెలుగులో ఈ అమ్మడికి మంచి ఎంట్రీ లభించినా ఆశించిన స్థాయిలో టాలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకోలేక పోయింది. తెలుగులో ఈ అమ్మడు చిరుత తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో మెల్లగా టాలీవుడ్‌కి ఈ అమ్మడు దూరం అవుతూ వచ్చింది. తెలుగులో ఈమె సినిమాలు చేయకున్నా బాలీవుడ్‌లో ఆఫర్లు సొంతం చేసుకుంటూ వచ్చింది. బాలీవుడ్‌లో ఈ అమ్మడికి అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికీ బాలీవుడ్‌లో ఈ అమ్మడి జోరు కంటిన్యూ అవుతోంది. మరో వైపు నేహా శర్మ సోదరి ఐషా శర్మ సైతం సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తుంది.


సోషల్‌ మీడియా ద్వారా నేహా శర్మ అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉంటుంది. అక్కకు ఏమాత్రం తగ్గకుండా చెల్లి ఐషా శర్మ సైతం రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ స్టార్‌ హీరోయిన్స్‌కి పోటీగా నిలుస్తుంది. సినిమాల్లో ఇప్పటి వరకు ఐషా శర్మ నటించకున్నా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే అందాల ఆరబోత ఫోటోల కారణంగా నార్త్‌ తో పాటు సౌత్‌లోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో కొందరి కంటే ఐషా శర్మ మరింత అందంగా ఉంటారంటూ కొందరు సోషల్‌ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.


రెగ్యులర్‌గా సోషల్‌ మీడియాలో అందమైన ఫోటోలను షేర్‌ చేసే ఐషా శర్మ తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా తన అందమైన ఫోటోలను మరోసారి షేర్‌ చేసింది. ఆకట్టుకునే ఐషా అందంతో పాటు చక్కని మెసేజ్‌ను షేర్‌ చేయడంతో ఆ పోస్ట్‌ కాస్త వైరల్‌ అవుతోంది. క్లీ వేజ్‌ షో తో ఆకట్టుకున్న ఐషా శర్మ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందాల ముద్దుగుమ్మను ఎప్పటికి వెండి తెరపై చూస్తామా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐషా కి పలువురు ఫిల్మ్‌ మేకర్స్ నుంచి సైతం ఆఫర్లు వస్తున్నానే వార్తలు వస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలతో పాటు... స్త్రీ మృదువైనది, కానీ పెళుసుగా ఉండదు.... బలంగా ఉంటుంది, కానీ కఠినంగా ఉండదు... ఉల్లాసభరితమైనది, కానీ ఉద్దేశపూర్వకంగా ఉంటుంది. తమ విలువను తెలుసుకుని ప్రవర్తించే వారు మహిళలు. ధైర్యంగా జీవిస్తూ, లోతుగా ప్రేమించుకుంటూ, మనల్ని పరిమితం చేయడానికి ప్రయత్నించి చరిత్ర తిరిగి రాద్దాం. ప్రతి స్త్రీ కి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పోస్ట్‌ చేసింది. ఐషా శర్మ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఈ మెసేజ్‌కి అంతా ఫిదా అవుతున్నారు. రెగ్యులర్‌గా వైరల్‌ అయ్యే ఐషా ఈసారి ఉమెన్స్ డే సందర్భంగా మరోసారి వైరల్‌ అవుతోంది.