Begin typing your search above and press return to search.

హీరోయిన్ చెల్లి.. మళ్ళీ హీటెక్కిచిందిగా...

నేహా శర్మ చెల్లెలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐషా, తన అందం, ఫిట్‌నెస్, ఫ్యాషన్ స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 9:30 PM GMT
హీరోయిన్ చెల్లి.. మళ్ళీ హీటెక్కిచిందిగా...
X

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐషా శర్మ తన గ్లామర్ డోస్‌తో మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చేసింది. నేహా శర్మ చెల్లెలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐషా, తన అందం, ఫిట్‌నెస్, ఫ్యాషన్ స్టైల్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఆమె, తన గ్లామర్‌ లుక్‌తో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌లో ‘సత్యమేవ జయతే’ చిత్రంతో హీరోయిన్‌గా మారిన ఐషా, ఆ తర్వాత గ్లామర్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ కొనసాగిస్తోంది.

సినిమాల్లో అనుకున్నంతగా అవకాశాలు రాకపోయినా, ఐషా సోషల్ మీడియాలో మాత్రం తన బోల్డ్ ఫోటోలతో రెగ్యులర్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోల్లో నటిస్తూ తన అందచందాలతో యూత్‌ను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌లో పెద్దగా సినిమాలు లేకపోయినా, ఐషా ఫిట్‌నెస్ మోడల్‌గా, బ్రాండ్స్ ప్రమోషన్‌లలో బిజీగా ఉంది. ఆమె గ్లామరస్ లుక్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫాలోవర్లను ఇంప్రెస్ చేస్తోంది.

తాజాగా ఐషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బికినీ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పర్పుల్ కలర్ డ్రెస్‌లో, ట్రాప్ డిజైన్ బికినీలో పూలు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ పక్కన కూల్ మూడ్‌లో ఫోజులిస్తూ కనిపించింది. లైట్ మేకప్, నేచురల్ హెయిర్‌స్టైల్‌తో మరింత అందంగా మెరిసిపోతూ ఫ్యాన్స్‌కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె గ్లామర్‌ లుక్స్‌కి ఫిదా అయిపోయారు.

ఐషా తన ఫోటోలకి ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. "ఈ ప్రదేశం నా పేరును మెల్లగా పలకడం కాదు.. నా పేరుని బిగ్గరగా అరిచింది! బాలి.. ఎట్టకేలకు వచ్చేశా." అని కొంటెగా వివరణ ఇచ్చింది. సినిమాల్లో మరిన్ని అవకాశాలు రావాలని ఎదురుచూస్తున్న ఐషా, తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో క్యాస్టింగ్ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఈ గ్లామర్ టచ్‌తో ఐషా త్వరలో బిగ్ ఆఫర్స్ దక్కించుకుంటుందో లేదో చూడాలి.