Begin typing your search above and press return to search.

వీడియో: మొన్న అక్క.. నిన్న చెల్లెలు ఏంటీ సాహ‌సాలు?

శ‌ర్మా సిస్ట‌ర్స్ ఏం చేసినా అది సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. ఇటీవ‌లే నేహా శ‌ర్మ బికినీ ధ‌రించి ఐస్ వాట‌ర్ ఛాలెంజ్ ని స్వీక‌రించింది

By:  Tupaki Desk   |   2 Jun 2024 9:34 AM GMT
వీడియో: మొన్న అక్క.. నిన్న చెల్లెలు ఏంటీ సాహ‌సాలు?
X

శ‌ర్మా సిస్ట‌ర్స్ ఏం చేసినా అది సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. ఇటీవ‌లే నేహా శ‌ర్మ బికినీ ధ‌రించి ఐస్ వాట‌ర్ ఛాలెంజ్ ని స్వీక‌రించింది. ఇప్పుడు చెల్లి వంతు. నేహా శర్మ తర్వాత, ఐషా శర్మ రెడ్ మోనోకినిలో చ‌ల్ల‌గా గ‌డ్డ క‌ట్టించే మైన‌స్ డిగ్రీల నీళ్ల‌లోకి దూకింది. ఐస్ వాట‌ర్ శ‌రీరాన్ని కొరికేస్తుంటే త‌ట్టుకోలేక‌పోయిన ఐషా శ‌ర్మ ఏం చేసిందో చూసారా..!

బాలీవుడ్‌లో బోల్డ్ అండ్ డ‌స్కీ బ్యూటీస్ గా పేరున్న నేహా శ‌ర్మ‌- ఐషా శ‌ర్మ రెగ్యుల‌ర్ గా హెడ్ ట‌ర్న‌ర్స్ గా మారుతున్నారు. వేడెక్కించే ఫోటోషూట్లతో ఈ భామ‌ల గ‌ట్సీ ఫోటోషూట్ లు ఇంట‌ర్నెట్ లో మంట‌లు పెడుతున్నాయి. తాజాగా నేహా శ‌ర్మ సోద‌రి ఐషా శ‌ర్మ‌ ఎరుపు రంగు స్విమ్‌సూట్‌లో ఐస్ వాట‌ర్ ట‌బ్‌లో దిగిన‌ప్ప‌టి వీడియో నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. ఇంత‌కు ముందు, ఐషా సోదరి నేహా శర్మ బ్లాక్ స్విమ్‌సూట్‌లో చ‌ల్ల‌ని నీటి ట‌బ్‌లోకి దిగిన వీడియోను షేర్ చేసింది. ఇప్పుడు ఐషా త‌న సోద‌రిని ఫాలో చేసింది.

ఐషా తన పోస్ట్‌కి ఆస‌క్తిక‌ర‌ క్యాప్షన్ ఇచ్చింది. ``ఏదైనా చేయండి కానీ అది ఆనందాన్ని కలిగించేదై ఉండాలి. నా ప్రాధాన్యత జాబితాలో ఆనందం అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాలు నా ఆనందాన్ని పెంపొందిస్తాయి`` అని వ్యాఖ్య‌ను జోడించింది. ఐషా ఈ వీడియోలో అద్భుతంగా కనిపించింది. అభిమానులకు ఊపిరి పీల్చుకోనివ్వ‌ని ట్రీట్ ఇది.

ఐషా 2018లో సత్యమేవ జయతే చిత్రంలో జాన్ అబ్రహం మనోజ్ బాజ్‌పేయి లాంటి స్టార్ల‌తో కలిసి నటించింది. బాలీవుడ్‌లో ఆరంగేట్ర చిత్ర‌మిది. అంత‌కుముందు చాలా మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది. ఈ వీడియోల‌తో ఐషాకు అపారమైన ఫాలోయింగ్ పెరిగింది. ఐషా శర్మ ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి ఫిట్నెస్ ఫ్రీక్ గా కొన‌సాగుతోంది. ఫిట్‌నెస్ అండ్ స్కిన్‌కేర్ ఉత్ప‌త్తుల ప్ర‌చారంలోను ఐషా భారీ ఒప్పందాల‌ను కుదుర్చుకుంది. ముఖ్యంగా సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు చేరువ‌గా ఉండ‌డం ఈ భామ‌ను నిరంత‌రం లైమ్ లైట్ లో ఉంచుతోంది.