Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఫెయిల్యూర్‌ కి రజినీ పాత్ర కారణం..!

ఈ సినిమా ఫెయిల్యూర్‌ పై తాజాగా ఒక తమిళ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన తప్పు వల్లే సినిమా ఫెయిల్‌ అయ్యిందని ఆమె పేర్కొంది.

By:  Tupaki Desk   |   9 March 2024 11:30 PM GMT
ఆ సినిమా ఫెయిల్యూర్‌ కి రజినీ పాత్ర కారణం..!
X

రజినీకాంత్‌ జైలర్ సినిమా తర్వాత బ్యాక్ టు ఫామ్‌ అన్నట్టు ఫ్యాన్స్ అంతా చాలా విశ్వాసం వ్యక్తం చేశారు. జైలర్ తర్వాత రజినీకాంత్‌ నుంచి వస్తున్న సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. కానీ రజినీ తదుపరి సినిమాగా వచ్చిన లాల్‌ సలామ్‌ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడి ఫ్యాన్స్ కి నిరాశను మిగిల్చాయి.

విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫెయిల్యూర్‌ పై తాజాగా ఒక తమిళ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన తప్పు వల్లే సినిమా ఫెయిల్‌ అయ్యిందని ఆమె పేర్కొంది.

ఐశ్వర్య రజినీకాంత్‌ మాట్లాడుతూ... మేము మొదట స్క్రిప్ట్‌ రాసుకున్న సమయంలో రజినీకాంత్‌ పాత్ర ను సెకండ్‌ హాఫ్ లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాం. అలా అనుకునే ఆయన్ను ఈ సినిమాలోకి తీసుకున్నాం. అయితే ఆయనకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో మరీ పది నిమిషాలే ఉంటే ప్రేక్షకులు ఒప్పుకోరు అనే ఉద్దేశ్యంతో పాత్రను పెంచుతూ వచ్చాం.

మంచి కంటెంట్ ఉన్న సినిమాను కమర్షియల్‌ ఎలిమెంట్స్ పేరుతో రజినీకాంత్‌ పాత్రను పెంచుతూ రావడం వల్ల మొత్తం ఫలితం తారు మారు అయ్యింది. సినిమాకు బలం అనుకున్న కథ రూపం మారిపోయింది. కంటెంట్‌ కూడా పూర్తిగా మారి పోయిందని ఆమె పేర్కొంది.

సినిమా విడుదలకు రెండు రోజుల ముందు వరకు కూడా ఏదో ఒక మార్పు చేస్తూనే వచ్చామని ఆమె పేర్కొన్నారు. సినిమా విడుదల తర్వాత నిడివి మరో 20 నుంచి 25 నిమిషాలు ఎక్కువ ఉండి ఉంటే కంటెంట్‌ ను మరింత సమర్ధవంతంగా చూపించి ఉండేవాళ్లం అనుకున్నాం.

మొత్తానికి సినిమాలో రజినీకాంత్‌ పాత్ర ను పెంచడం వల్ల ఫెయిల్‌ అయ్యిందని స్వయంగా ఆయన కూతురు దర్శకురాలు అయిన ఐశ్వర్య రజినీకాంత్‌ అన్నారు. నిజంగానే కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాల్లో స్టార్‌ ఇమేజ్ కోసం మార్పులు చేస్తే ఇలాగే ఉంటుందని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. సూపర్ స్టార్‌ కంటే కూడా కంటెంట్ కీలకం అని లాల్‌ సలామ్ నిరూపించిందని స్వయంగా దర్శకురాలు ఐశ్వర్య మాటలతో క్లారిటీ వచ్చింది.