జోడీగా ఐశ్వర్య..తండ్రికా! కొడుక్కా?
అందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారంలోనూ ఉంది. అయితే ఐశ్వర్య లక్ష్మి ఓ పాత్రకు పెయిర్ గా ఎంపికైంది. మరి తండ్రికి జోడీగానా ? లేక కొడుక్కి జోడీగానా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
By: Tupaki Desk | 17 Jan 2025 6:30 PM GMTమాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి సౌత్ ఇండస్ట్రీకి దూసుకుని వచ్చింది. తొలుత మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అటుపై తమిళ్, తెలుగు సినిమాలకు ప్రమోట్ అయింది. ఆరంభంలో వరుసగా బాగానే సినిమాలు చేసింది. టాలీవుడ్ లో 'గాడ్సే'తో లాంచ్ అయింది. అటుపై 'అమ్ము' అనే మరో తెలుగు సినిమా చేసింది. ఈ రెండింటితో కేరళ అందానికి పెద్దగా ఒరిగిందేం లేదు. కోలీవుడ్ లోనే బెటర్ గా సినిమాలు చేసింది. ప్రస్తుతం అక్కడ యాక్టివ్ గా ఉంటుంది.
మూడేళ్ల తర్వాత ఇటీవలే మళ్లీ 'సంబరాల ఏటి గట్టు' అనే సినిమాకి సైన్ చేసింది. ఇందులో అల్లరి నరేష్ కి జోడీగా నటిస్తోంది. ఆ రకంగా ఐశ్వర్య లక్ష్మిపేరు టాలీవుడ్ లో మళ్లీ మొదలైంది. అయితే తాజాగా అమ్మడు కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య చిత్రంలో ఛాన్స్ అందుకుంది. వెంట్రీమారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓసినిమా తెరకె క్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి కొడుకు పాత్రలు తానే పోషిస్తున్నాడు.
అందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారంలోనూ ఉంది. అయితే ఐశ్వర్య లక్ష్మి ఓ పాత్రకు పెయిర్ గా ఎంపికైంది. మరి తండ్రికి జోడీగానా ? లేక కొడుక్కి జోడీగానా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో సూర్య ఊర మాస్ పాత్రలో కనిపించనున్నాడు. కుమారుడి రోల్ కూడా అంతే మాసివ్ గా ఉంటుందని సమాచారం.
ఈ నేపథ్యంలో హీరోయిన్ గా పలువురు భామలను పరిశీలించి నప్పటికీ చివరిగా ఐశ్వర్య లక్ష్మిని లుక్ టెస్ట్ చేసి ఎంపిక చేసినట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వెట్రీ మారన్ చిత్రంలో హీరోయిన్ అవకాశం అంటే అంత వీజీ కాదు. చాలా టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని పర్పెక్ట్ గా కుదిరితేనే వెట్రీమారన్ ఎంపిక చేస్తాడు. ఆ రకంగా అమ్మడు అన్నింటి ప్రూవ్ చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కలై పులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.