Begin typing your search above and press return to search.

మెగా అల్లుడితో ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్.. కొత్త డైరెక్టర్ రోహిత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   6 Sep 2024 9:25 AM GMT
మెగా అల్లుడితో ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?
X

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్.. కొత్త డైరెక్టర్ రోహిత్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విరూపాక్ష, బ్రో వంటి చిత్రాలతో మంచి హిట్స్ అందుకున్న సుప్రీమ్ హీరో.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఆ మూవీ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది. ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.


అనౌన్స్మెంట్ సమయంలో మేకర్స్ విడుదల చేసిన పోస్టర్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. ల్యాండ్ మైన్ లు చుట్టుముట్టిన ఎడారి భూమిలో పచ్చని చెట్టుతో ఉన్న పోస్టర్ సినీ ప్రియులను బాగా అలరించింది. యూనివర్శల్‌ కాన్సెప్ట్‌ తో సినిమా రూపొందుతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. మూవీలో సాయి దుర్గ తేజ్‌ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ అప్పుడు తెలిపారు. ఇప్పుడు సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇచ్చారు.

SDT 18 మూవీలో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి యాక్ట్ చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 6వ తేదీన ఐశ్వర్య పుట్టిన రోజు కావడంతో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వసంత పాత్రలో ఆమె నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. "బంజరు భూముల్లో గాలి.. ఐశ్వర్యలక్ష్మిని వసంతగా పరిచయం చేస్తున్నాం. SDT 18 వరల్డ్ నుంచి ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్" అంటూ మేకర్స్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఐశ్వర్య ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెస్ట్ ఆఫ్ లక్ తో పాటు బర్త్ డే విషెస్ కూడా చెబుతున్నారు నెటిజన్లు. పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెబుతున్నారు. ఎడారిలో నడుస్తూ వెళుతున్న ఆమె లుక్.. సినిమాపై అంచనాలు పెంచుతుందని అంటున్నారు. ప్రస్తుతం SDT 18 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.

1947 హిస్ట‌రీ బ్యాక్‌ డ్రాప్‌ లో రాబోతున్న SDT18 చిత్రంలో సాయి తేజ్ ఒక యోధుడి పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో షూట్ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా రానున్న SDT 18 సినిమాతో ఐశ్వర్య లక్ష్మి ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.