పెళ్లి గిళ్లీ జాన్తా నయ్ అంటోన్న హీరోయిన్!
అమ్మాయి..అబ్బాయి ల అభిప్రాయాలు సేకరించిన తర్వాత రకరకాల అంశాలు నిత్యం సోషల్ మీడియాలో చర్చకొస్తున్నాయి.
By: Tupaki Desk | 20 Nov 2024 11:30 AM GMTపెళ్లి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్న అంశం. 30-40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. దీనిపై ఇప్పటికే రకరకాల సర్వేలు జరిగాయి. అమ్మాయి..అబ్బాయి ల అభిప్రాయాలు సేకరించిన తర్వాత రకరకాల అంశాలు నిత్యం సోషల్ మీడియాలో చర్చకొస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లి పై అంటే? సినిమా సెలబ్రిటీలు మాత్రమే ఎంతో ఓపెన్గా అభిప్రాయాలు పంచుకునే వారు. కానీ ఇప్పుడు సోషల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత మేల్-ఫీమేల్ ఇద్దరు ఎంతో ఓ పెన్గా తమ సోషల్ మీడియా ప్లాంట్ ఫాం ద్వారా అభిప్రాయాలు చెబుతున్నారు.
తాజాగా మలయాళం నటి ఐశ్వర్య లక్ష్మి కూడా పెళ్లి వద్దు బాబోయ్ అంటోంది. `జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. ఎవరో తప్ప చాలా మంది రాజీ పడి బ్రతుకుతున్నారు. పెళ్లి వల్ల వ్యక్తిగతంగా ఎదగలేకపోతున్నాం. అందుకే పెళ్లి వద్దనుకుంటున్నా. 25 ఏళ్ల వయసులో గురువాయూర్ గుడిలో చాలా పెళ్లిళ్లు చూసాను. అవి చూసి నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ పెద్దయ్యాక పెళ్లి గురించి పుల్ క్లారిటీ వచ్చింది.
కొన్నాళ్ల క్రితం వరకూ నేను పెళ్లి బాగుంటుందనుకున్నా. ఓ మ్యాట్రీమోనిలో నా ప్రోపైల్ కూడా పెట్టాను. అది చూసి చాలా మంది పేక్ ప్రోపైల్ అనుకున్నారు. కానీ అది నిజమే. కానీ పెళ్లిపై అభిప్రాయం మారిన తర్వాత ప్రోపైల్ డిలీట్ చేసాను` అంది. మొత్తానికి ఐశ్వర్య లక్ష్మి కూడా జీవితాంతం అవివాహితగా మిగిలిపోవాలని బలమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి కూడా పెళ్లి చేసుకోనని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చెప్పింది.
కానీ ఆ తర్వాత పెళ్లిపై అభిప్రాయం మార్చుకుంది. మరి పెళ్లి చేసుకుంటుందా? లేక పెళ్లి పై అభిప్రాయాన్ని మాత్రమే మార్చుకుందా? అన్నది క్లారిటీ రావాలి. ఇంకా పెళ్లి అంటే గిట్టని భామలు చాలా మంది ఉన్నారు. సల్మాన్ ఖాన్, ప్రభాస్ కూడా ఇంకా పెళ్లి చేసుకోని సంగతి తెలిసిందే.