Begin typing your search above and press return to search.

నా ఆలోచ‌న‌ల‌న్నీ కుమార్తె కోస‌మే..మ‌రే ఆలోచ‌న లేదు!

బ‌చ్చ‌న్ కుటుంబంతో ఐశ్వ‌ర్యారాయ్ రిలేషన్ షిప్ స‌రిగ్గా లేదంటూ కొన్నాళ్ల‌గా మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Sep 2024 10:30 AM GMT
నా ఆలోచ‌న‌ల‌న్నీ కుమార్తె కోస‌మే..మ‌రే ఆలోచ‌న లేదు!
X

బ‌చ్చ‌న్ కుటుంబంతో ఐశ్వ‌ర్యారాయ్ రిలేషన్ షిప్ స‌రిగ్గా లేదంటూ కొన్నాళ్ల‌గా మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గ‌ట్టే ఫ్యామిలీతో కాకుండా ఐశ్వ‌ర్యారాయ్ కుమార్తెతో క‌లిసి క‌నిపించ‌డం? ఆ ఫోటోలు...వీడియోల‌కు అంతే ప్రాధాన్య‌త ద‌క్కింది. ఇవ‌న్నీ చూసి నిజంగానే బ‌చ్చ‌న్ ఫ్యామిలీతో రిలేష‌న్ షిప్ స‌రిగ్గా లేద‌నే క‌థ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అయ్యాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్యారాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ` నా ఆరోగ్యం నా బిడ్డ శ్రేయ‌స్సు కోస‌మే. నా ఆలోచ‌నలు....నా మైండ్ ఎప్పుడు ఆరాధ్య గురించే ప‌నిచేస్తుంటుంది. మ‌న‌సులోకి ఇంకెలాంటి ఆలోచ‌న‌లు రానివ్వ‌ను. నేనెప్పుడు నా వ్య‌క్తిగ‌త జీవితానికే ప్రాధాన్య‌త ఇస్తాను. నా బిడ్డ గురించే ఆలోచిస్తాను. నేనెప్పుడు జీరోసైజ్ గురించి ఆలోచించ‌చ‌లేదు.

దానికంత ప్రాధాన్య‌త కూడా ఇవ్వ‌ను. నా కుమార్తె ఆరాధ్య పుట్టిన త‌ర్వాత బాగా బ‌రువు పెరిగాను. దాంతో ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కున్నాను. శ‌రీరంలో మార్పుల‌నేవి స‌హ‌జంగానే వ‌స్తాయి. అందుకోసం త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌ని నాణ్య‌త‌లేని ప్రోడ‌క్ట్ లు వాడ‌ను. బ‌రువు త‌గ్గ‌డం కోసం కొంద‌రు అనుభ‌వ‌జ్ఞులైన మ‌హిళ ల‌తో మాట్లాడాను. వాళ్ల స‌ల‌హాలు తీసుకున్నాను. నా దృష్టిలో మాతృత్వం అంటే ఒత్తిడి లేకుండా నిజ‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌డ‌మే.

అది అల‌వాటు చేసుకుంటే చాలా విషయాల ప‌ట్ల అవ‌గాహ‌న క‌లుగుతుంది. జీవితంలో ఎలా ముందుకెళ్లా ల‌న్న‌ది కూడా ఒత్తిడిని జ‌యించిన‌ప్పుడే తెలుస్తుంది` అని అంది. ఐశ్వ‌ర్యారాయ్ చివ‌రిగా పొన్నియ‌న్ సెల్వ‌న్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా రెండు భాగాలు మంచి విజ‌యం సాధించాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఐష్ కొత్త సినిమాల‌కు సైన్ చేయ‌లేదు. మ‌రి అవ‌కాశాలు రాక చేయ‌లేదా? వ‌చ్చినా వ‌ద్దు అనుకుందా? అన్న‌ది క్లారిటీ లేదు.