Begin typing your search above and press return to search.

అందం హాస్యం.. ఒకే ఫ్రేమ్ లో..

ఒకప్పటి మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ని అంత ఈజీగా ఎవరు మరిచిపోలేరు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 6:16 AM GMT
అందం హాస్యం.. ఒకే ఫ్రేమ్ లో..
X

ఒకప్పటి మిస్ వరల్డ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ని అంత ఈజీగా ఎవరు మరిచిపోలేరు. బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది సౌత్ సినిమా ద్వారానే. 1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్ 1997లో మణిరత్నం ‘ఇరువర్’ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. అదే ఏడాది హిందీలో ‘ఔర్ ప్యార్ హో గయా’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 1998లో మరల శంకర్ దర్శకత్వంలో ‘జీన్స్’ మూవీలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించింది.


ఆ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగులో నాగార్జున ‘రావోయి చందమామ’ సినిమాలో ఒక సాంగ్ లో ఐశ్వర్య రాయ్ నటించింది. తరువాత బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోవడంతో సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయలేదు. దశాబ్దకాలం పాటు బాలీవుడ్ లో చక్రం తిప్పిన ఐశ్వర్య రాయ్ మరల 2010 విక్రమ్ ‘రావణ్’, సూపర్ స్టార్ రజినీకాంత్ ‘రోబో’ చిత్రాలతో తమిళంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఐశ్వర్యరాయ్ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించకపోయిన కూడా ఆమెకి ఇక్కడి స్టార్స్ తో మంచి రిలేషన్ షిప్ ఉంది. అలాగే సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ అంటే ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. చివరిగా ఆమె ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ లో నందిని క్యారెక్టర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా దుబాయ్ లో ఐఫా అవార్డుల వేడుక జరిగింది. ఈ ఈవెంట్ లో ఇండియా సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషలకి చెందిన సెలబ్రెటీలు పాల్గొన్నారు.

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్య బచ్చన్ తో ఐఫా ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ సౌత్ ఇండియన్ సెలబ్రెటీలు అందరికి తన కుమార్తెని పరిచయం చేశారు. అలాగే వారితో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. ఐఫా ఈవెంట్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు. ఇక ఐశ్వర్య రాయ్ బచ్చన్, బ్రహ్మానందంను కలుసుకొని తన కూతురు ఆరాధ్యతో పాటు ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సెల్ఫీతో బ్రహ్మానందంపై ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కి ఎంత రెస్పెక్ట్ ఉందో స్పష్టం అవుతుంది. బాలీవుడ్ స్టార్ ఇంటికి కోడలిగా వెళ్లిన ఆమెకి పెద్దలపై ఉండే గౌరవం ఏ మాత్రం తగ్గలేదని ఐఫా వేడుక చూసిన వారికి అర్ధమైంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, తన కుమార్తెని పేరు పేరున సౌత్ లో స్టార్ యాక్టర్స్ అందరికి పరిచయం చేసింది. ఆరాధ్య వారి నుంచి వారితో ఆశీర్వాదాలు తీసుకుంది. మరి వారసురాలిగా కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందో లేదో చూడాలి.