నటి ఫోన్ వాల్ పేపర్ చూసి షాక్‌లో
ఇటీవల ఐశ్వర్యారాయ్ బచ్చన్ జీవితం మీడియా రాడార్ కి చిక్కింది. చాలా కాలంగా విడాకుల వార్తలతో ఐష్ కలతగా ఉంది.
By: Tupaki Desk | 30 Nov 2024 1:30 AM GMTసెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై రంధ్రాన్వేషణ చేయడంలో ముంబై మీడియా నైపుణ్యం ఎన్నదగినది. సెలబ్రిటీలను వెంటాడి వార్తల్ని కవర్ చేయడంలో వీళ్ల తర్వాతే. ఇప్పుడు ప్రముఖ మీడియా ఐశ్వర్యారాయ్ ఫోన్ వాల్ పేపర్ గా ఉన్న ఫోటో గురించి ఒక ఆసక్తికర కథనం రాసింది. ఐష్- అభిషేక్ విడిపోతున్నారన్న ప్రచారం నడుమ ఇదొక ట్విస్ట్. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఇటీవల ఐశ్వర్యారాయ్ బచ్చన్ జీవితం మీడియా రాడార్ కి చిక్కింది. చాలా కాలంగా విడాకుల వార్తలతో ఐష్ కలతగా ఉంది. ఇంతలోనే గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్‌కు హాజరైన ఐశ్వర్య రాయ్ ఇటీవల దుబాయ్ నుండి తిరిగి వచ్చారు. ముంబై విమానాశ్రయం నుండి బయటకు వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. కెమెరాల ముందు నవ్వుతూ ఫోజులిచ్చిన ఐష్ తన కారు వైపు నడుస్తుంటే తన ఫోన్ వాల్ పేపర్ పై ఏం ఉందో ముంబై మీడియా కనిపెట్టింది. దానిని క్యాప్చుర్ చేసింది. ఈ వీడియోలో ఫోన్ వాల్‌పేపర్‌ను గమనించి వరుస కథనాలు రాయడం మొదలు పెట్టారు.
ఇంతకీ ఆ వాల్ పేపర్ లో ఏం ఉంది? అంటే... అందులో ఐశ్వర్య కూతురు ఆరాధ్య మరొకరితో కలిసి కనిపించింది. మరొక వ్యక్తి ఎవరు? అంటే... కచ్ఛితంగా ఆరాధ్య తాతగారు అమితాబ్ బచ్చన్. అది ఐశ్వర్య దివంగత తండ్రి కృష్ణరాజ్ రాయ్ అని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఆరాధ్య తన తాతగారితో దిగిన ఫోటోని ఐశ్వర్యారయ్ తన ఫోన్ వాల్ పేపర్ గా ఫిక్స్ చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్ -ఐశ్వర్య రాయ్ వైవాహిక జీవితంలో ఇబ్బందుల గురించి పుకార్లు షికార్ చేస్తున్న ఈ సమయంలో ...ఇది మరో కొత్త పుకార్ కి తెర తీసింది. తన తండ్రి అభిషేక్ తో ఆరాధ్య కలిసి ఉన్న ఫోటోను ఎందుకు ఎంపిక చేసుకోలేదు ఐష్ ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజనులు.
ఇప్పటికే అమితాబ్, అభిషేక్ తమపై సాగుతున్న ప్రచారంపై చాలా సీరియస్ గా ఉన్నారు. పలుమార్లు ఆవేదన చెందారు. కానీ మీడియా రాతలు ఇప్పటికీ ఆగడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహంలో ఈ జంట విడివిడిగా మీడియాకు కనిపించిన తర్వాత ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఇదే కాకుండా ఐశ్వర్య ఇటీవల కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు వేడుకల నుండి ఫోటోలను షేర్ చేయగా.. ఇందులో అభిషేక్ సహా బచ్చన్ కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించలేదు. ఇది ఈ జంట మధ్య దూరం ఉందన్న రుజువులు అంటూ రెడ్డిటర్లు రాసారు. అంతా బావుంటే కీలకమైన ఆరాధ్య పుట్టినరోజుకు బచ్చన్లు ఎందుకు రాలేదు? అన్న ప్రశ్న ఉదయించింది. మీడియా పుకార్లను కొట్టి పారేయలేదు. అలాగని అంగీకరించనూ లేదు. ఇవి ఊహాగానాలు మాత్రమేనని అభిషేక్ ఇంతకుముందు సోషల్ మీడియాలో రాసిన నోట్ లో వ్యాఖ్యానించారు.
అవి ఊహాజనిత అవాస్తవాలు, ధృవీకరణలు, వెరిఫికేషన్‌లు లేకుండా తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, వాణిజ్య ప్రకటనలను ప్రామాణీకరించడానికి మీడియాలు ప్రయత్నిస్తాయి.. అని నిందించారు అభిషేక్.