బ్యాలెన్స్ తప్పితే కష్టమే.. భాగ్యం చెప్పిన సంక్రాంతి సినిమా ముచ్చట్లు..!
సుడల్ వెబ్ సిరిస్ షూటింగ్ లో వున్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు.
By: Tupaki Desk | 8 Jan 2025 3:45 PM GMTవిక్టరీ వెంకటేష్, అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నిటికీ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి పోటీలో సత్తా చాటేందుకు వస్తున్న వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి మరిన్ని విశేషాలు సినిమా కథానాయిక ఐశ్వర్య రాజేష్ మీడియాతో ముచ్చటించింది ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ప్రాజెక్ట్ లో ఎలా వచ్చారు ? ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?
సుడల్ వెబ్ సిరిస్ షూటింగ్ లో వున్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్ కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్ కి ఒక యాస వుంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను. ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్ ని నరేట్ చేశారు. నరేషన్ లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెదికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా వుంది.
నేను ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను.'సంక్రాంతికి వస్తున్నాం' నాకు చాలా స్పెషల్. గోదారి గట్టు పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్ లా పాకిందని అన్నారు ఐశ్వర్య రాజేష్.
అంతేకాదు తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు గోదారి గట్టు పాటతో తీరిందని అన్నారు. వెంకటేష్ గారు లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా వుంది. అలాగే సినిమాలో పాటన్నీ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా అని అన్నారు ఐశ్వర్య రాజేష్.
వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?
బిగినింగ్ లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చూస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా క్రూసియాల్ రోల్. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది.
వెంకీ గారు ఎమోషన్స్ అన్నీ నేచురల్ గా వుంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. భాగ్యం క్యారెక్టర్ లో అదరగొడుతున్నావ్ అని మెచ్చుకునే వారు. కానీ డైలాగులు ఇచ్చేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది(నవ్వుతూ). వెంకీ గారు, అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను. వెంకీ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. వండర్ ఫుల్ పర్శన్ అని అన్నారు ఐశ్వర్య రాజేష్.
సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైయింది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. అనిల్ గారు చాలా క్రియేటివ్ గా ఈ కథని చెప్పారుని అన్నారు.
మీనాక్షి చౌదరితో యాక్ట్ చేయడం గురించి..?
మీనాక్షి చాలా సింపుల్. తనకి నాకు దగ్గర పోలికలు. డాక్టర్ చదువుకుంది. కష్టపడి పైకి వచ్చింది. తను చాలా స్వీట్. తనకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీను సాంగ్ లో తప్పితే.. వెంకటేష్ గారు నేను మీనాక్షి .. ముగ్గురూ సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే. ఇందులో వెంకీ గారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ అని అన్నారు.
దిల్ రాజు గారి నిర్మాణంలో చేయడం ఎలా అనిపించింది..?
దిల్ రాజు, శిరీష్ గారి బ్యానర్ లో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్.
మీ కథల ఎంపిక ఎలా వుంటుంది..?
సినిమాలో చేసే అవకాశం అందరికీ రాదు. అదొక అదృష్టం. భిన్నమైన కథలు చెప్పడానికి సినిమా గొప్ప వేదిక. నా వరకూ డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏ పాత్ర చేసినా సోషల్ రెస్పాన్స్ బిలిలిటీ వుండాలని కోరుకుంటానని అన్నారు ఐశ్వర్య రాజేష్.