Begin typing your search above and press return to search.

ఆ హీరోతో నటించాలని భాగ్యం డ్రీమ్‌..!

కోలీవుడ్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్‌లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   23 Jan 2025 4:30 PM GMT
ఆ హీరోతో నటించాలని భాగ్యం డ్రీమ్‌..!
X

సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం రోల్‌లో నటించిన ఐశ్వర్య రాజేష్ కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌తో అలరించింది. అంతే కాకుండా ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కామెడీతో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేష్ ముందు ముందు టాలీవుడ్‌లో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఐశ్వర్య రాజేష్ అడుగు పెట్టి చాలా కాలం అవుతున్నా ఇంత మంచి పాత్ర దక్కలేదు, ఈ స్థాయి హిట్‌ పడలేదు. రెండు ఒకే సినిమాతో దక్కడంతో ఐశ్వర్య రాజేష్‌ ఫుల్‌ హ్యాపీగా ఉంది. కోలీవుడ్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్‌లోనూ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... తనకు ఎన్టీఆర్‌ అంటే చాలా అభిమానం. ఆయన్ను స్టూడెంట్‌ నెం.1 సినిమా అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాను. ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం వస్తే కచ్చితంగా వదులుకోను. తారక్ డైలాగ్‌ డెలివరీ, డాన్స్‌, యాక్టింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో ఆయన నటించే తీరు నాకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. ఆయనతో వర్క్‌ చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను. ఆ అవకాశం ఇప్పటి వరకు రాలేదు. భవిష్యత్తులో వస్తే కచ్చితంగా వదులుకోకుండా చేస్తాను అంటూ ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో చీర కట్టులో కనిపించి గ్లామర్ షో చేసిన మీనాక్షి చౌదరికి పోటీ ఇచ్చింది. ఆమె అందాన్ని చూపిస్తున్నా ఈమె ఎక్కడ తగ్గకుండా తన నటనతో చూపు తన వైపు తిప్పుకుంది. సినిమా ప్రమోషన్‌ సమయంలోనూ దర్శకుడు అనిల్‌ రావిపూడికి పూర్తిగా సహకరించి సినిమా ప్రమోషన్‌లో తనవంతు పాత్ర పోషించింది. తక్కువ సమయంలోనే సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకోవడంలో కచ్చితంగా భాగ్యం పాత్ర కీలకం అనడంలో సందేహం లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ఈ సినిమా విజయంలో ఐశ్వర్య పాత్ర కీలకం అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ్‌లో పలు సినిమాలను చేస్తోంది. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమాకు కమిట్‌ కాలేదు. ఈ సినిమా హిట్‌ నేపథ్యంలో ఇకపై వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్‌ పాత్రలే ఈమెకు దక్కే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. అయితే యంగ్‌ స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. ఎన్టీఆర్‌తో ఈమె నటించాలని కోరుకుంటున్నప్పటికీ అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి. ఎన్టీఆర్‌ వంటి స్టార్‌ మాస్ హీరోతో నటించే అవకాశం రావడం కచ్చితంగా చాలా పెద్ద విషయం. మరి ఆ పెద్ద ఆఫర్‌ ఐశ్వర్య రాజేష్‌కి వస్తుందా అనేది చూడాలి.