Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : భాగ్యం ఫ్యాన్‌ మూమెంట్‌

అయితే ఈసారి తన అభిమాన సెలబ్రెటీతో దిగిన ఫోటోను ఫ్యాన్‌ మూమెంట్‌ ఫోటో అంటూ అభిమానులతో షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   26 March 2025 7:50 AM
Aishwarya Rajesh With MS Dhoni
X

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో టాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న తమిళ హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌. తెలుగులో చాలా కాలం క్రితమే కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్‌ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి తన అభిమాన సెలబ్రెటీతో దిగిన ఫోటోను ఫ్యాన్‌ మూమెంట్‌ ఫోటో అంటూ అభిమానులతో షేర్ చేసింది.


ఐశ్వర్య పెద్ద స్టార్ అయినప్పటికీ ఆమెకు క్రికెటర్ ఎంఎస్ ధోనీ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 2025 సందర్భంగా ఆయనతో ఫోటో తీసుకుంది. ధోనీని కలిసే అవకాశం చాలా తక్కువ మందికి దక్కుతుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం ధోనీతో ఒక్క ఫోటో దిగాలని కోరుకుంటూ ఉంటారు. ఐశ్వర్య రాజేష్ సైతం చాలా కాలంగా ధోనీతో సెల్ఫీ కోసం ప్రయత్నాలు చేస్తుందట. తాజాగా ధోనీతో సెల్ఫీ దొరకడంతో ఐశ్వర్య రాజేష్ చాలా సంతోషంగా కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో మన యొక్క తల తో అంటూ ఐశ్వర్య రాజేష్ సోషల్‌ మీడియాలో తన ఆనందంను పంచుకుంది. ధోనీతో ఐశ్వర్య దిగిన సెల్ఫీకి కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది ఫోటోను షేర్‌ చేశారు.


చెన్నై సూపర్‌ కింగ్స్‌ జెర్సీలో ధోనీ ఉండగా, వైట్‌ డ్రెస్‌లో క్యూట్‌ అండ్‌ కూల్‌ మేకోవర్‌తో ఐశ్వర్య రాజేష్‌ను ఈ సెల్ఫీలో చూడవచ్చు. 3.4 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఐశ్వర్య రాజేష్ ఈ ఫోటోను షేర్‌ చేసిన వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఐపీఎల్‌ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ఎంఎస్ ధోని కి ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ధోనీతో ఐశ్వర్య రాజేష్ సెల్ఫీని తీసుకునే అవకాశం రావడంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ లక్కీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఐశ్వర్య రాజేష్‌ ప్రస్తుతం తమిళ్‌లో కరుప్పర్ నగరం, తీయవర్ కులైగల్ నడుంగ సినిమాలతో పాటు మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. తమిళ్ మూవీస్‌తో పాటు ఒక కన్నడ మూవీలోనూ ఈమె నటిస్తుంది. ప్రస్తుతం ఈమె చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇటీవలే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా టాలీవుడ్‌లోనూ ఈమెకు వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కవచ్చు. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ టాలీవుడ్‌ దర్శకులు ఈమెతో చర్చలు జరుపుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో వెంకటేష్‌ను ఇబ్బంది పెట్టే భార్య పాత్రలో కనిపించిన ఐశ్వర్య రాజేష్‌ను అదే స్థాయి పాత్రలో మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి అది ఎప్పటికి సాధ్యం అవుతుంది అనేది చూడాలి.