ఎన్టీఆరే బెస్ట్ ఫెర్ఫార్మర్ అనేసిన హీరోయిన్..!
హోమ్లీ లుక్ తో తనదైన పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో టాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించింది.
By: Tupaki Desk | 16 Feb 2025 3:54 AM GMTతెలుగు మూలాలున్నా సరే తమిళ నటిగా గుర్తింపు తెచ్చుకుని అక్కడ ఒక మోస్తారు పాపులారిటీ తెచ్చుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్ అమ్మడు తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నా ఐదేళ్ల క్రితమే ఇక్కడ ఒకటి రెండు సినిమాలు చేసినా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు అందుకే కాస్త వెనకపడ్డది. ఐతే ఈ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ అందుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది ఐశ్వర్య రాజేష్. హోమ్లీ లుక్ తో తనదైన పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో టాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించింది.
ఐతే ఈ హిట్ తో మరిన్ని అవకాశాలు రాబట్టాలని చూస్తుంది అమ్మడు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో కెరీర్ లో జోష్ కనబరుస్తుంది. ఇక హిట్ జోష్ లో వరుస ఇంటర్వ్యూస్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలుగులో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరన్న ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తన దృష్టిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎన్టీఆర్ అని అన్నది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని నేను. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, డ్యాన్సుల్లో స్పెషాలిటీ ఉంటుందని అన్నది ఐశ్వర్య రాజేష్. అందరి ప్రదర్శన ఇష్టమే కానీ ఎన్టీఆర్ నా ఫేవరెట్ అని చెప్పింది అమ్మడు.
ఎన్టీఆర్ నటన గురించి ఇప్పటికే చాలామంది భామలు చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఐశ్వర్య కూడా చేరింది. ప్రస్తుతం తారక్ పై ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇక ఐశ్వర్య కెరీర్ విషయానికి వస్తే సంక్రాంతికి వస్తున్నాం తో తెలుగులో తొలి సక్సెస్ అందుకుంది అమ్మడు. ఇలా హోంలీ రోల్స్ తో తెలుగులో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది ఐశ్వర్య.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి కన్నా వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ కే ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తన ఫేవరెట్ అని చెప్పింది కాబట్టి ఈ కామెంట్స్ విన్న ఏ డైరెక్టర్ అయినా తారక్ సినిమాలో ఛాన్స్ ఉంటే మాత్రం ఐశ్వర్య రాజేష్ ని తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.