Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి పెట్టుకున్న గొప్ప రూల్ ఇది!

తాజాగా ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా ఐశ్వ‌ర్యా రాజేష్ పాత్ర‌ల ఎంపిక విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిహిస్తుందో రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 10:30 AM GMT
తెలుగ‌మ్మాయి పెట్టుకున్న గొప్ప రూల్ ఇది!
X

తెలుగు అమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేష్ తెలుగు సినిమాలు చేసింది చాలా త‌క్కువ‌. ఇప్ప‌టి వ‌ర‌కూ కెరీర్ మొత్తంలో చేసిన తెలుగు సినిమాలు ఎన్ని అంటే ఓ నాలుగైదు క‌నిపిస్తాయి. అంత‌కు మించి టాలీవుడ్ లో ఆమె సాధించింది ఏం లేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం అమ్మ‌డు చాలా సినిమాలు చేసింది. అంజ‌లి అలియాస్ సీత‌మ్మ లా అక్క‌డ బాగా ఫేమ‌స్ అయింది. మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది.

అయితే విక్ట‌రీ వెంక‌టేష్ తో క‌లిసి న‌టించిన `సంక్రాంతికి వ‌స్తున్నాం `సినిమాతో బాగా ఫేమ‌స్ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి ప్ర‌చారంలో భాగంగా ఐశ్వ‌ర్యా రాజేష్ స‌హా మిగ‌తా టీమ్ తో చేయిస్తోన్న స్కిట్లు..ఇత‌ర ఫ‌న్నీ వీడియో బాగా వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ఐశ్వ‌ర్య రాజేష్ మ‌న తెలుగ‌మ్మాయి అనే ప్ర‌త్యేక అభిమానం చూపించే వారి సంఖ్య పెరుగుతుంది.

తాజాగా ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా ఐశ్వ‌ర్యా రాజేష్ పాత్ర‌ల ఎంపిక విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిహిస్తుందో రివీల్ చేసింది. `సినిమాల్లో ప్రతీ అవ‌కాశం గొప్ప‌దే. మంచి అవ‌కాశం వ‌చ్చిందంటే దాన్ని ఈజీగా తీసుకోకూడ‌దు. ఏదో ఒక‌టి చేయాల్సిందేన‌న్న త‌ప‌న ఉండాలి. నా వ‌ర‌కూ ప్ర‌తీ సినిమా కూడా తొలి అడుగుగానే భావిస్తా. నేను చేసే ప్ర‌తీ పాత్ర స‌మాజానికి ఎంతో కొంత ఉప‌యోగ ప‌డాలి అని భావిస్తాను.

అలాంటి పాత్ర‌తో స‌మాజంలో చిన్న మార్పు వ‌చ్చినా నాకు ఎంతో సంతోషం. సినిమా అనేది నా స్వార్దం అయితే అదే స్వార్దంతో ఏదైనా చిన్న మార్పు తేగ‌ల‌ను అన్న ఆశ నాలో ఉప్పుడూ ఉంటుంది. నాకు రీమేక్ సినిమాలు చేయ‌డం ఇష్టం ఉండ‌దు. కానీ `ది గ్రేట్ ఇండియా కిచెన్` లో చేసానంటే అందుకు కార‌ణం ఉంది. అది స‌మాజానికి అవ‌స‌ర‌మైన సినిమాగా భావించే న‌టించాను. అలాంటి పాత్ర‌లొస్తే మాత్రం వ‌దుల‌కోను` అని తెలిపింది.