ఆమె కంటే ఒక్క అడుగు ముందంజలో ఐశ్వర్య రాజేష్!
ఈ నేపథ్యంలో ఐశ్వర్య పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఐశ్వర్య రాజేష్ ని తెలుగు అభిమాను సౌందర్య అంటూ కీర్తిస్తున్నారు.
By: Tupaki Desk | 17 Jan 2025 9:30 PM GMTఐశ్వర్యా రాజేష్ తెలుగులో నటించింది నాలుగైదు సినిమాలే. తెలుగు నటి అయినా ఇక్కడ పెద్దగా ప్రోత్సాహకం లభించక పోవడంతో కోలీవుడ్ లో సక్సెస్ అయింది. అక్కడ నుంచి తెలుగు సినిమాలకు ప్రమోట్ అయింది. 'కౌసల్య కృష్ణ మూర్తి', 'మిస్ మ్యాచ్', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్', 'రిపబ్లిక్' లాంటి చిత్రాల్లో నటించింది. కానీ వీటిలో ఏ సినిమా అంతగా ఫేమస్ చేయలేదు. అయితే ఇటీవల రిలీజ్ అయిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో మాత్రం తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.
విక్టరీ వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్యర్య నటన, ఆహార్యంతో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో నటిగా ఓ మెట్టు పైకి ఎక్కింది. అచ్చమైన తెలుగింట ఆడపడుచునే చూపించింది. ఈ సినిమా ఐశ్వర్య కెరీర్ లో గొప్ప చిత్రంగా నిలిచి పోతుందనొచ్చు. ఇంతకాలం తెలుగు నుంచి సరైన నటి లేదు? అనే ఉన్నవాళ్లకు అవకాశాలు రాలేదు అన్న బాధ చాలామందిలో కనిపించేది. కానీ ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్నాం లో నటించిన తీరుతో చాలా కాలానికి ఓ గొప్పనేచురల్ పెర్పార్మర్ దొరికిందనే ప్రశంస అందుకుంటుంది.
అంజలి అలియాస్ సీతమ్మ ఉన్నా? ఆమెకి సరైన పాత్రలు పడకపోవడంతో ప్రూవ్ చేసుకోలేకపోయింది. కానీ ఐశ్వర్య మాత్రం తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించింది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఐశ్వర్య రాజేష్ ని తెలుగు అభిమాను సౌందర్య అంటూ కీర్తిస్తున్నారు. అప్పట్లో వెంకటేష్-సౌందర్య కాంబినేషన్ అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వెండి తెరపై సూపర్ జోడీగా పేరు తెచ్చుకుంది.
ఆ కాంబోలో ఎన్నో విజయవంతమైన చిత్రాలొచ్చాయి. అలా వెంకీ-సౌందర్య కాంబినేషన్ అంటే మార్కెట్ లో బ్రాండ్ గా మారిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ చాలా మంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఏ కాంబోకి అంత గుర్తింపు రాలేదు. చాలా కాలానికి మళ్లీ ఐశ్వర్య రాజేష్ రూపంలో వెంకీకి పర్పెక్ట్ జోడీ అంటూ నీరాజనాలు అందు కుంటుంది. యూత్ ఫుల్ చిత్రాలు..ప్రేమికురాలు పాత్రలకంటే ఐశ్వర్యకు పిల్లల తల్లి పాత్రలు... భార్య పాత్రలు.. అక్కా..చెల్లి పాత్రలే పర్పెక్ట్ గా సూటవుతాయని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా సక్సస్ తో అంజలి కంటే నటిగా ఒక్క అడుగు ముందులో ఐశ్వర్య కనిపిస్తుందంటున్నారు.