Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముగ్గురు హీరోలా..?

ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు నటించారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 3:45 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ముగ్గురు హీరోలా..?
X

విక్టరీ వెంకటేష్ అనీల్ రావిపూడి సూపర్ హిట్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు నటించారు. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య వెంకీ మామ పడే పాట్లు ఏంటో జనవరి 14 నుంచి థియేటర్ లో చూడాల్సిందే. ఐతే సంక్రాంతికి వస్తున్నా కి సూపర్ ప్రమోషన్స్ చేస్తున్న టీం చెబుతున్న మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో వెంకటేష్ ఒక్కడే కాదు మరో ఇద్దరు కూడా హీరోలుగా ఉన్నారని తెలుస్తుంది.

అదేంటి సినిమాలో ఒక్కడే ప్రధాన పాత్ర దారి అది వెంకటేషే కదా అనుకోవచ్చు. మెయిన్ లీడ్ వెంకటేష్ అన్నది అందరికీ తెలుసు కానీ ఆ పాత్రకు సినిమా మొత్తం పక్కనే ఉండి నడిపించే రెండు పాత్రలు పోషించారు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి. రీసెంట్ గా ఐశ్వర్య ఇంటర్వ్యూలో కేవలం మీనాక్షి తో వచ్చే సాంగ్ లో తప్ప త్రూ అవుట్ సినిమా మొత్తం మేము ముగ్గురం కనిపిస్తామని అన్నది. సో దాన్ని బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరో ఒక్కడు కాదు ముగ్గురు అని చెప్పేలా ఉంది.

వెంకటేష్ మార్క్ ఎమోషనల్ ఇంకా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఈ సినిమా తెరకెక్కించాడు అనీల్ రావిపూడి. ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేస్తున్నారు. సినిమాలో నటించాం ఇక చేతులు దులిపేసుకుందాం అన్నట్టు కాకుండా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ లో పూర్తిగా పాల్గొంటున్నారు.

సినిమాకు సాంగ్స్ ద్వారా మంచి క్రేజ్ రాగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. సినిమా లో వెంకీ మామ కడుపుబ్బా నవ్విస్తాడని అంటున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందా అన్నది చూడాలి. పోటీగా రెండు భారీ సినిమాలు ఉన్న ఈ టైం లో సంక్రాంతికి వస్తున్నాం అసలైన సంక్రాంతి సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి. వెంకటేష్ అండ్ టీం మాత్రం తప్పకుండా ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అనీల్ రావిపూడి సినిమాలు అన్నీ సూపర్ హిట్ కాగా ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరుతుందా లేదా అన్నది చూడాలి.