బాలయ్య కాళ్లకు ఐశ్వర్యారాయ్ నమస్కారం!
సంస్కారం అంటే ఐశ్వర్యారాయ్.. ఐశ్వర్యారాయ్ అంటే సంస్కారం అన్న పాయింట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్.
By: Tupaki Desk | 29 Sep 2024 10:14 AM GMTసంస్కారం అంటే ఐశ్వర్యారాయ్.. ఐశ్వర్యారాయ్ అంటే సంస్కారం అన్న పాయింట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్. ఇటీవలే ఐశ్వర్యారాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ ..కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కాళ్లకు నమస్కరించిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ అవార్డు ఫంక్షన్ లో భాగంగా ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. అది చూసి ఒక్క క్షణం అంతా స్టన్ అయిపోయారు.
ఆరాద్యకు పెద్దలంటే ఆ స్థాయిలో భక్తిశ్రద్దలున్నాయా? అని ఆశ్చర్యపోయారు. ఐశ్వర్యారాయ్ కుమార్తెని ఎంత గొప్పగా పెంచిందన్నది ఒక్క వీడియో ఎంతో చర్చకు దారి తీసింది. అభిషేక్ బచ్చన్ కుమార్తెను అనిగానీ, అమితాబచ్చన్ , జయాబచ్చన్ మనవరాలు అని గానీ, అన్నింటిని మించి ఐశ్యర్యారాయ్ కుమార్తెను అనే గర్వం గానీ ఇసుమొత్తు కూడా ఆరాధ్యలో కనిపించలేదు. ఎంతో డౌన్ టూ ఎర్త్ ఉంటేనే అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు.
ఆ విషయంలో ఓతల్లిగా ఐశ్వర్యారాయ్ ని ఎన్నో ప్రశంసలందుకుంది. తాజాగా ఐశ్వర్యారాయ్ కి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డు వేడుకల్లో భాగంగా వేదిక మీదకు అవార్డు అందుకోవడానికి వచ్చిన సమయంలో ఐశ్వర్యారాయ్ ముందుగా బాలకృష్ణ కాళ్లకు నమస్కరించింది. దీంతో బాలయ్య వెంటనే ఆమెని ఆశీర్వదించారు.
అనంతరం బాలయ్య ఇచ్చిన అవార్డును తీసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ సింప్లిసిటీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తానో మాజీ విశ్వ సుందరి అనిగానీ, పెద్ద స్టార్ అనే గర్వంగానీ...అమితాబచ్ ఇంట కోడలిననే గర్వంగానీ ఐశ్వర్యా రాయ్ ఎక్కడా ప్రదర్శించలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉండాలి అన్నది నేటి జనరేషన్ హీరోయిన్లు ఐశ్వర్యారాయ్ ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.