Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ కి పడిపోయిన మరో హీరోయిన్..!

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కొందరు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని బాహాటంగానే చెప్పారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో చేరింది అందాల భామ ఐశ్వర్య లక్ష్మి.

By:  Tupaki Desk   |   23 Aug 2023 2:49 PM GMT
ఐకాన్ స్టార్ కి పడిపోయిన మరో హీరోయిన్..!
X

స్టైలిష్ స్టార్ నుంచి పుష్పతో ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఆయన చూపించిన అభినయం ఆడియన్స్ కి పిచ్చెక్కించేసింది. అలా పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంటారు కాబట్టే స్టార్స్ గా అభిమానుల హృదయాల్లో ఉండిపోతారు.

కెరీర్ లో మొదటి నుంచి తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వస్తున్న అల్లు అర్జున్ పుష్ప 1 తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ అవడంతో పుష్ప 2 తో నెక్స్ట్ లెవెల్ రికార్డులపై గురి పెట్టాడు అల్లు అర్జున్.

ఈ క్రమంలో అల్లు అర్జున్ కి కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు సినీ సెలబ్రిటీస్ కూడా ఫ్యాస్ గా మారారు. వారిలో హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే సౌత్ స్టార్ హీరోయిన్స్ లో కొందరు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని బాహాటంగానే చెప్పారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో చేరింది అందాల భామ ఐశ్వర్య లక్ష్మి. మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న ఐశ్వర్య లక్ష్మి తెలుగు, తమిళ భాషల్లో కూడా ఛాన్స్ లు అందుకుంటున్నారు.

లేటెస్ట్ గా దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఐశ్వర్య లక్ష్మి. ఈ క్రమంలో తనకు ఇష్టమైన టాలీవుడ్ హీరోల గురించి ఐశ్వర్య ప్రస్తావించారు. తెలుగు స్టార్స్ నుంచి అయితే అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని.. ఆయన స్టైలింగ్ ఇతరులకు భిన్నంగా ఉంటుందని అన్నారు.

స్పెషల్ గా యూనిక్ గా అల్లు అర్జున్ ఉంటారని అందుకే ఆయన అంటే ఇష్టమని అలాంటివారు ఎవరైనా బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకొచ్చారు ఐశ్వర్య లక్ష్మి. అల్లు అర్జున్ కి కేరళలో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగుతో పాటుగా అల్లు అర్జున్ అన్ని సినిమాలు కేరళలో భారీగా రిలీజ్ అవుతుంటాయి. అందుకే అక్కడ హీరోయిన్స్ కి కూడా అల్లు అర్జున్ అంటే ఒక రకమైన క్రేజ్ ఉంటుంది.

అల్లు అర్జున్ అంటే డ్యాన్స్, స్టైల్ అయితే పుష్ప సినిమాలో వీటితో పాటు ఊర మాస్ పాత్రలో తన నట విశ్వరూపం చూపించారు బన్నీ. పుష్ప 2 అంచనాలకు తగినట్టుగానే సినిమా ప్లాన్ చేస్తున్నారట. అసలైతే డిసెంబర్ రిలీజ్ అనుకున్న పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వాయిదా పడిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప 2 కోసం నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.