Begin typing your search above and press return to search.

కేన్స్‌లో గాయంతో ఐష్‌.. క్యూట్ డాట‌ర్ సాయం చూసారా?

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కేన్స్ లో రెడ్ కార్పెట్ ఈవెంట్ కి రెడీ అవుతున్న స‌మ‌యంలో ఒక లాంగ్ డిజైన‌ర్ లెహంగాలో న‌డ‌వ‌డానికి ఇబ్బందిపడుతున్న ఐష్‌కి కుమార్తె ఆరాధ్య ఎంతో స‌హ‌కారం అందించింది.

By:  Tupaki Desk   |   17 May 2024 5:39 AM GMT
కేన్స్‌లో గాయంతో ఐష్‌.. క్యూట్ డాట‌ర్ సాయం చూసారా?
X

అవును... ఐశ్వ‌ర్యారాయ్ గాయ‌ప‌డింది. త‌న మోచేతికి క‌ట్టు క‌ట్టుకుని గాయంతోనే కేన్స్ 2024 ఉత్స‌వాల్లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే త‌న‌కు గాయం అయినా కానీ త‌న‌ను కంటికి పాప‌లా కాపాడుకుంటూ అన్నివిధాలా కూతురు ఆరాధ్య 'అమ్మ' అయింది. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ కేన్స్ లో రెడ్ కార్పెట్ ఈవెంట్ కి రెడీ అవుతున్న స‌మ‌యంలో ఒక లాంగ్ డిజైన‌ర్ లెహంగాలో న‌డ‌వ‌డానికి ఇబ్బందిపడుతున్న ఐష్‌కి కుమార్తె ఆరాధ్య ఎంతో స‌హ‌కారం అందించింది.

ఎట్ట‌కేల‌కు ఐష్‌ రెడ్ కార్పెట్‌పై విజ‌య‌వంతంగా నడిచిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. అయితే ఐష్ కి అన్ని చోట్లా కుమార్తె ఆరాధ్య కావాల్సిన‌ స‌హాయం అందించింది. హోటల్ నుండి బయటకు వెళ్లే సమయంలో కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఐష్‌ చేతిని పట్టుకుని దుస్తులను మేనేజ్ చేయ‌డంలో త‌న‌కు ఎంతో సహాయం చేసింది. ఐశ్వర్య తన కారు వైపు వెళుతున్నప్పుడు ఆమె దుస్తుల రైలును మోసుకెళ్తున్న వ్యక్తుల పరివారం కూడా ఎంతో సహాయం చేసారు. ఆ స‌మ‌యంలో ఆరాధ్య త‌న మామ్ ఐశ్వ‌ర్యారాయ్ చెయ్యి పట్టుకుని మెట్లు దిగింది. హోట‌ల్ లాబీలో మరొక వీడియోలో ఆరాధ్య తన తల్లికి స‌హ‌కారిగా క‌నిపించింది.

ఐశ్వర్య ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల చిత్రం 'మెగాలోపోలిస్ ప్రీమియర్‌'లో రెడ్ కార్పెట్‌పై బ్లాక్ అండ్ వైట్ దుస్తులలో ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించారు. దీనికి బంగారు త‌ళ‌త‌ళ‌ల పుష్పాల వంటి డిజైన్స్ ప్ర‌త్యేక సొబ‌గును అద్దాయి. ఈ దుస్తులను ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేశారు.

ఐశ్వర్య 2002 నుండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెగ్యులర్‌గా హాజ‌ర‌వుతోంది. ఆమె మొదటిసారిగా షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీతో కలిసి వారి చిత్రం దేవదాస్ ప్రీమియర్ కోసం వేడుకకు హాజరయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా ఐశ్వర్య లోరియల్ అంబాసిడ‌ర్ గా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఆరాధ్య కూడా కొన్నేళ్లుగా తన తల్లితో కలిసి కేన్స్‌కు వెళుతోంది.

గ‌తంలోను కేన్స్ ప్రదర్శనల కోసం ఐశ్వర్య దుస్తులను డిజైన్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా మాట్లాడుతూ .. ది గ్రేట్ ఐష్ 2003లో విరిగిన పాదంతో రెడ్ కార్పెట్‌పై నడిచినట్లు గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఫ్యాషన్ పోలీసులు ఐశ్వర్య రాయ్ దుస్తులు స‌రిగా లేవ‌ని ఎదురు దాడి చేశారు. అయితే త‌న‌కు తెలీకుండా కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని నీతా లుల్లా అన్నారు. చాలా వెరైటీ దుస్తులు ఉన్నా కానీ ఆ స‌మ‌యంలో ఏదో త‌ప్పు జ‌రిగింద‌ని కూడా నీతాజీ వివ‌ర‌ణ ఇచ్చారు.

ఈ సంవత్సరం, ఐశ్వర్యతో పాటు భారతీయ నటీనటులు కియారా అద్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావు హైదరీ కూడా కేన్స్ 2024 చిత్రోత్సవంలో పాల్గొంటారు.