అల్లుడంటే మామకి ఎంత ప్రేమంటే?
ఇరువురిది ప్రేమ వివాహం. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మంచి కుటుంబంలో వ్యక్తిని ప్రేమించిందని అర్జున్ కూడా చాలా సంతోషించాడు
By: Tupaki Desk | 20 Jun 2024 5:42 AM GMTకోడలు కుమార్తె తో సమానమైతే? అల్లుడు కొడుకు తో సమానమంటారు. మరి అత్తగారింట్లో ఇలాంటి గౌరవ, మర్యాదలు ఎంత మంది కోడళ్లకు, అల్లుళ్లుకు దక్కుతున్నాయో తెలియదుగానీ! అలా నెత్తిన పెట్టి చూసుకుంటే అంతకంటే అదృష్టవంతులు మరొకరు లేనట్లే. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ ఇంటికి అల్లుడిగా వెళ్లిన ఉమాపతి అలాంటి లక్కీ పర్సన్ అనే అనిపిస్తుంది. ఇటీవలే అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం ఉమాపతితో జరిగిన సంగతి తెలిసిందే.
ఇరువురిది ప్రేమ వివాహం. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మంచి కుటుంబంలో వ్యక్తిని ప్రేమించిందని అర్జున్ కూడా చాలా సంతోషించాడు. దీంతో కుమార్తె పెళ్లి విషయంలో ఎలాంటి కండీషన్లు పెట్టలేదు. ఆమె నాన్నికి చెప్పడం ఒప్పుకోవడం...పెళ్లి చేసుకోవడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. అయితే ఉమాపతిని పెళ్లి కొడుకు దుస్తుల్లో చూసి కన్న తల్లిదండ్రులు కన్నా! ఎక్కువగా సంతోషించాడు అర్జున్.
ఉమపాతి దుస్తులపై పూలు పడితే అర్జున్ మెడలో ఉన్న కండువాతో తుడిచాడు. చెమట పడితే మ్యాకప్ చెరిగిపోకుండా అద్దాడు. చివరిగా ఉమాపతి పెదాల్ని చేతులతో తాకి ఓ ముద్దు కూడా ఇచ్చాడు. పక్కనే ఉన్న అత్తమ్మ కూడా అల్లుడిపై అంతే ప్రేమ కురిపించింది. ఇంటికి అల్లుడి కాలు పెట్టక ముందే? పెళ్లి కొడుకుగా ఉన్న సమయంలోనే ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. పెళ్లి కుమార్తె దుస్తుల్లో పక్కనే కూర్చున్న ఐశ్వర్య ఉమాపతిని అలా చూసుకోవడం చూసి మనసులో ఎంతో సంతోషపడింది.
ఆనంద బాష్పాలు ఉబికి వచ్చాయి. కూతురు కన్నా? అల్లుడే ఎక్కువ అన్నంతగా సంబర పడింది. కొత్త అల్లుడు ఇంటికెళ్లక ముందే పెళ్లి మండపంలోనే ఇంతటి రాచ మర్యాదలు దక్కాయంటే? ఇంటికెళ్తే అల్లుడ్ని ఇంకే ఏ రేంజ్ లో చూసుకుంటారో? అన్నది ఊహకే వదిలేయాలి.