ఐశ్వర్య రాజేష్ వ్యక్తిగత జీవితం ఎంతో విషాధం!
ఐశ్వర్యా రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. `కౌసల్య కృష్ణ మూర్తి`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తొలి సినిమాతోనే నటనలో తనదైన మార్క్ వేసింది.
By: Tupaki Desk | 14 May 2024 6:04 AM GMTఐశ్వర్యా రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. `కౌసల్య కృష్ణ మూర్తి`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తొలి సినిమాతోనే నటనలో తనదైన మార్క్ వేసింది. విమర్శలకు ప్రశంసలు దక్కించుకుంది. కానీ అమ్మడి కెరీర్ ఇక్కడ ఆశించిన విధంగా సాగలేదు. కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయినా ? ఆమె ఛరిష్మా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అయినా ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. ఆడ ఉంటా..ఈడా ఉంటానంటూ కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది.
ప్రస్తుతం తమిళ్ .కన్నడ..మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈ మె కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభిచిన నటే. అయితే ఐశ్వర్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అన్న సంగతి తక్కువ మందికి తెలుసు. ఆమె బాల నటిగా చేసిన తొలి తెలుగు సినిమా `రామబంటు`. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సినిమాలో బాల నటిగా మెప్పించింది. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ ఒక్క సినిమానే చేయడంతో పెద్దగా ఫోకస్ లోకి రాలేదు. తాజాగా ఐశ్వర్య వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఆమె వ్యక్తగత జీవితంలో చాలా విషాధమే నిండి ఉందని తెలుస్తోంది.
కష్టాల్లో ఉన్న వారికి తన తండ్రి సహాయం చేసినందుకు గాను కుటుంబం మొత్తం బలైపోయిందని తెలిపింది. ష్యూరిటీ మీద రుణాలు తన తండ్రి ఇప్పించారుట. ఆ తర్వాత కొన్ని రోజులకి తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో అప్పు తీసుకున్న వారంతా ఎగ్గొట్టారన్నారు. దీంతో ఆ బాధ్యతలు తన ల్లి తీసుకోవాల్సి వచ్చింది తెలిపింది. ` అప్పుడే ఓ ప్లాట్ అమ్మేసి అప్పులు తీర్చింది అమ్మ. అన్నికష్టాల్లోనే అమ్మ నన్ను ఎంతో చదివించింది.
ఏ లోటు లేకుండా నన్ను అన్నయ్యల్ని చూసుకున్నారు. వారిద్దరు చదువు పూర్తి చేసి ఉద్యోగానికి వెళ్తాం అనుకున్న సమయంలో ఓ ప్రమాదంలో మరణించారు. అప్పటికే దుఖంలో ఉన్న అమ్మని ఆ సంఘటన మరింత కృంగదీసింది. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడింది. ఇలా అమ్మను చూసి నేను జీవితంలో ఎన్నో విషయాలు తెలసుకున్నా. వృత్తిపరంగా ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురైనా ముందుకు వెళ్లానంటే కారణం అమ్మ నాలో నింపిన స్పూర్తి. అలాగే అతి మంచికి పోకూడదు. అందులోనూ ఈరోజుల్లో అస్సలు మంచిది కాదు` అని తెలిపింది.