సీక్వెల్ కోసం భూపతి కొత్త భామని తెస్తున్నాడా?
ఇటీవలే `మంగళవారం చిత్రానికి సీక్వెల్ కూడా అజయ్ భూపతి ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Feb 2025 8:30 AM GMTపాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన లేడీ ఓరియేంటెడ్ థ్రిల్లర్ `మంగళవారం` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన చిత్రం బాగానే రాణించింది. హిట్ లేక సతమతమవుతోన్న పాయల్కి ఈ సినిమా మంచి బూస్టింగ్ లా నిలిచింది. `మంగళవారం` తర్వాత ఓ మూడు సినిమా లకు సైన్ చేసింది. అనివార్య కారణాలతో అవి డిలే అవుతున్నాయి తప్ప ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన చిత్రాలవి.
ఇటీవలే `మంగళవారం చిత్రానికి సీక్వెల్ కూడా అజయ్ భూపతి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో పాయల్ రాజ్ పుత్ పాత్రలో యధావిధిగా తాను కొనసాగుతుందని అంతా భావిస్తున్నారు. ఎక్కడ ముగించారో? మళ్లీ అక్కడ నుంచే రెండవ భాగం కథ కొనసాగుతుంది కాబట్టి ఆ పాత్రలో పాయల్ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో పాయల్ రాజ్ పుత్ కూడా చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తోంది. అయితే పాయల్ పాత్రని రీప్లేస్ చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.
పాయల్ స్థానంలో మరో కొత్త బ్యూటీని తెరపైకి తీసుకు రావాలని అజయ్ భూపతి ప్లాన్ చేస్తున్నాడట. పాయల్ రాజ్ పుత్ కంటే కొత్త భామ అయితే ప్రేక్షకులకు థ్రిల్ ఫీలవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని భావిస్తున్నాడట. అలాగే అజయ్ రాసిన పాత్రకు పాయల్ హైట్ కంటే ఇంకా ఎత్తైన హీరోయిన్ అయితే బాగుంటుందన్నది మరో ఆలోచన లో ఉన్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.
ప్రస్తుతం నటీనటుల ఎంపిక పనుల్లో బిజీ అయినట్లు సమాచారం. దీనిలో భాగంగానే హీరోయిన్ విషయం తెరపైకి వస్తోంది. మరి ఈ సంగతి పాయల్ కి తెలిస్తే ఎలా స్పందిస్తుందో చూడాలి. వాస్తవానికి `మంగళవారం` చిత్రంలోనే అజయ్ తొలుత పాయల్ ని అనుకోలేదు. పాయల్ రాజ్ పుత్ తారసపడిన సందర్భంలో తానే నటిస్తానని అజయ్ కి చెప్పడంతో తీసుకున్నాడు. కానీ ఈసారి అందుకు ఏమాత్రం స్కోప్ కనిపించడం లేదు. మరి ఈ విషయంలో పాయల్ ఏదైనా మ్యాజిక్ చేస్తుందోమో చూడాలి.