Begin typing your search above and press return to search.

మరో పాయల్ వేటలో డైరెక్టర్..?

మంగళవారం సినిమాతో పాయల్ కూడా ఫాం లోకి తిరిగి వచ్చిందని అనిపించింది. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా అజయ్ భూపతి అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 10:30 AM GMT
మరో పాయల్ వేటలో డైరెక్టర్..?
X

ఆరెక్స్ 100 తో సెన్సేషనల్ హిట్ కొట్టి డైరెక్టర్ గా తన మార్క్ చాటిన అజయ్ భూపతి ఆ నెక్స్ట్ మహాసముద్రం అంటూ వచ్చి నిరాశపరిచాడు. ఆ సినిమా గురించి తను ఏర్పరచిన అంచనాలు భారీగా ఉండటం వల్ల ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత మళ్లీ పాయల్ రాజ్ పుత్ తోనే మంగళవారం అంటూ ఒక సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు అజయ్ భూపతి. మంగళవారం సినిమాతో పాయల్ కూడా ఫాం లోకి తిరిగి వచ్చిందని అనిపించింది. సినిమా కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా అజయ్ భూపతి అంటే ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.

అందుకే ఇప్పుడు అజయ్ భూపతి నెక్స్ట్ మంగళవారం 2 చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే కథ పూర్తి కాగా నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడట అజయ్ భూపతి. ఐతే తను పాయల్ రాజ్ పుత్ లాంటి మరో యాక్ట్రెస్ కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో హిందీ సీరియల్స్ చేస్తున్న పాయల్ రాజ్ పుత్ ని తెచ్చి ఆరెక్స్ 100 సినిమా చేసి ఆమె కెరీర్ కు హెల్ప్ అయ్యేలా చేశాడు అజయ్ భూపతి.

ఆమెతోనే మంగళవారం సినిమా చేశాడు. ఐతే మంగళవారం లో పాయల్ క్యారెక్టర్ ఎండ్ అవుతుంది సో మంగళవారం 2 కొత్త హీరోయిన్ ని దించాల్సిందే. ఐతే పాయల్ లానే అటు గ్లామర్ గా ఉంటూ మంచి నటన కనబరచాలని చూస్తున్నాడట అజయ్ భూపతి. ఐతే మళ్లీ పాయల్ తో తీసినా సరే ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే ఛాన్స్ లేకపోలేదు. ఐతే పాయల్ కూడా అజయ్ భూపతి సినిమా అంటే కథ గురించి కూడా పట్టించుకోకుండా ఓకే చేస్తుంది.

మరి మంగళవారం 2 సినిమా అజయ్ ప్లానింగ్ ఎలా ఉంది. పాయల్ తో కానిస్తాడా లేదా పాయల్ లాంటి మరో హీరోయిన్ ని తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. మంగళవారం తర్వాత పాయల్ మళ్లీ కెరీర్ లో వెనకబడింది. తనకు ఆరెక్స్ 100 లాంటి సినిమాలే వస్తున్నాయి కాబట్టి రెగ్యులర్ గా సినిమాలు చేయట్లేదని అంటుంది పాయల్ రాజ్ పుత్. మంగళవారం 2 సెట్స్ మీదకు వెళ్లే దాకా అందులో నటించే స్టార్ కాస్ట్ ఎవరన్నది క్లారిటీ వచ్చేలా లేదు. ఐతే ఆరెక్స్ 100, మంగళవారం సినిమా ఫ్యాన్స్ అయితే పాయల్ తోనే అజయ్ ఈ మూవీ చేయాలని కోరుతున్నారు.