Begin typing your search above and press return to search.

మంగళవారం-2.. సీక్వెల్ కాదట..

RX 100.. ఆరేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 7:30 PM GMT
మంగళవారం-2.. సీక్వెల్ కాదట..
X

RX 100.. ఆరేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి మేకర్స్ మంచి లాభాలు అందించింది. యువ నటుడు కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఆ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పరిచయమయ్యారు. అయితే మూవీతో అటు హీరో.. ఇటు హీరోయిన్, డైరెక్టెర్ అజయ్.. ముగ్గురూ మంచి ఫేమ్ దక్కించుకున్నారు.

ఇక ఆర్ ఎక్స్ 100 తర్వాత హీరోయిన్ పాయల్ పలు సినిమాల్లో నటించినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. హిట్స్ అందుకోలేకపోయింది. డైరెక్టర్ అజయ్ భూపతి కూడా మహాసముద్రం తీసినా.. హిట్ సాధించలేకపోయారు. అయితే వీరిద్దరూ మళ్లీ గత ఏడాది కలిసి వర్క్ చేసిన విషయం తెలిసిందే. మంచి హిట్ కొట్టాలనే పట్టుదలతో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అజయ్ భూపతి.. మంగళవారం మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

శైలు పాత్రలో పాయల్ సినిమాలో చక్కగా ఒదిగిపోయి మెప్పించింది. గ్లామర్ తోపాటు యాక్టింగ్ అదరగొట్టేసింది. అదే సమయంలో బోల్డ్ థ్రిల్లర్ గా కథను రాసుకున్న దర్శకుడు అజయ్ భూపతి.. మంగళవారంతో మంచి హిట్ అందుకున్నారు. భారీ వసూళ్లను రాబట్టకపోయినా.. మేకర్స్ కు లాభాలు మాత్రం వచ్చాయి. అయితే ఇప్పుడు మంగళవారం-2కు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

అజయ్ భూపతి.. మంగళవారం-2 కోసం వర్క్ చేస్తున్నారని, స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. అయితే సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని తెలుస్తోంది. మొత్తం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక.. అనౌన్స్మెంట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత నటీనటులు, టెక్నీషియన్స్ ను సెలెక్ట్ చేయనున్నారని వినికిడి. అందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేయనున్నట్లు సమాచారం. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మంగళవారం ప్రీక్వెల్ ను నిర్మిస్తుందట.

అయితే అజయ్ భూపతి.. మంగళవారం-2తోపాటు మరో మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తున్నారట. ఆ చిత్రానికి అనుకున్న క్యాస్టింగ్ సెట్ అవ్వకపోతే.. మంగళవారం ప్రీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. తాను అనుకున్న నటీనటులు అందుబాటులోకి వస్తే.. మంగళవారం-2ను తర్వాత తీయనున్నట్లు తెలుస్తోంది. మరి మంగళవారం ప్రీక్వెల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.