Begin typing your search above and press return to search.

యాక్టర్ అజయ్.. న్యూ పవర్ఫుల్ లుక్

ఆ సినిమాలో అజయ్ క్యారెక్టర్ ని దర్శకధీరుడు పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు.

By:  Tupaki Desk   |   26 Sept 2024 12:54 PM IST
యాక్టర్ అజయ్.. న్యూ పవర్ఫుల్ లుక్
X

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే అందులో అజయ్ పేరు కూడా కచ్చితంగా ఉంటుంది. హీరో ఫ్రెండ్స్, సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన అజయ్ రాజమౌళి ‘విక్రమార్కుడు’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ యాక్టర్ గా మారిపోయాడు. ఆ సినిమాలో అజయ్ క్యారెక్టర్ ని దర్శకధీరుడు పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు.


ఈ సినిమా తర్వాత అజయ్ చాలా కాలం విలన్ పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు. కొన్ని సినిమాలలో అజయ్ హీరోగా కూడా చేసి మెప్పించాడు. అందులో నాగ శౌర్యతో కలిసి నటించిన ‘దిక్కులు చూడకు రామయ్య’ ఒకటి. ఈ సినిమాలో నాగ శౌర్యకి తండ్రిగా నటించిన కూడా కథ మొత్తం అజయ్ చుట్టూనే తిరుగుతుంది. అజయ్ కొన్ని సినిమాలలో కామెడీ పాత్రలలో కూడా నటించి తనదైన శైలిలో మెప్పించాడు.

ప్రస్తుతం అజయ్ కెరియర్ పరంగా ఒకప్పటి స్థాయి స్పీడ్ లేకపోయిన రెగ్యులర్ గా మూవీస్ చేస్తున్నాడు. ఇక నేడు అజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన కీలక పాత్రలో నటించిన ‘పొట్టేల్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ లోనే అజయ్ నటించినట్లు ఈ లుక్ బట్టి తెలుస్తోంది. మెరిసిన గడ్డంతో పంచెకట్టులో జీపులో అలా కూర్చొని సీరియస్ గా చూస్తున్న ఈ లుక్ లో అజయ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడనే మాట వినిపిస్తోంది.

యువచంద్ర, అనన్య నాగళ్ళ జోడీగా నటిస్తున్న ఈ సినిమా సాహిత్ మొత్ఖురి దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్, నిశా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. గ్రామీణ నేపథ్యంలో ఈ పొట్టేల్ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. మూవీ పోస్టర్స్, టీజర్ బట్టి కథ మొత్తం ఒక పొట్టేలు చుట్టూ తిరుగుతుందని అర్ధమవుతోంది.

తెలంగాణ నేటివిటీలో రియాలిటీకి దగ్గరగా ఉండే కథాంశంతో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించారంట. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో అజయ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అయన పోస్టర్ లుక్ తో కన్ఫర్మ్ చేశారు. ఇక సినిమాలో అజయ్ క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.