మంగళవారంకు సాలీడ్ బేరాలు
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ మంగళవారం.
By: Tupaki Desk | 26 Oct 2023 4:23 AM GMTఅజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ మంగళవారం. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సిద్ధమవుతోంది. నవంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఒక విలేజ్ నేపథ్యంలో ఈ మూవీ కథని దర్శకుడు చెబుతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
టీజర్ విపరీతంగా ఆడియన్స్ ని కనెక్ట్ అయిపొయింది. టీజర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ వరకు విజువల్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఒకరకమైన ఇంట్రెస్ట్ ని అజయ్ భూపతి క్రియేట్ చేశాడు. దీంతో అమాంతం మంగళవారం సినిమాకి సినిమా సర్కిల్ లో డిమాండ్ పెరిగిపోయింది. అలాగే పోస్టర్స్ కూడా మూవీ ఇంటెన్షన్ ని చెబుతున్నాయి.
దీంతో మంగళవారం సినిమాకి ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఈ సినిమా ఆంధ్రా, సీడెడ్ కలిపి సింగిల్ పాయింట్ లో7.20 కోట్లకి సేల్ చేసేశారు. మరల ఇప్పుడు ఈ సినిమాకి ఏరియా వైజ్ గా కూడా ఊహించని డిమాండ్ వస్తోంది. ఒక్క ఆంధ్రా రైట్స్ కోసమే ఆరు కోట్లు ఆఫర్ చేస్తున్నారంట. అజయ్ భూపతి ఈ చిత్రాన్ని మినిమమ్ బడ్జెట్ లోనే చేశారు.
ఈ ఆఫర్ చూస్తుంటే మూవీపై డిస్టిబ్యూటర్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అర్ధమవుతోంది. మిగిలిన భాషలలో కూడా మంగళవారం సినిమా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాన్ థీయాట్రికల్ రైట్స్ కోసం కూడా ప్రముఖ ఒటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ బిజినెస్ లెక్కలు చూస్తుంటే రిలీజ్ కి ముందే మంగళవారం సినిమాకి టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా కనిపిస్తోంది.
అజయ్ భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తరువాత మహా సముద్రం మూవీ డిజాస్టర్ అయ్యింది. మూడో ప్రయత్నంగా భిన్నమైన కాన్సెప్ట్ తీసుకొని మంగళవారం చేశారు. కాంతారా సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.