Begin typing your search above and press return to search.

మంగళవారం చూసి అలా మాత్రం చేయకండి.. డైరెక్టర్ రిక్వెస్ట్..!

Rx 100, మహాసముద్రం రెండు సినిమాలతోనే డైరెక్టర్ గా తన ముద్ర వేసుకున్న అజయ్ భూపతి తన మూడో సినిమాగా మంగళవారం అంటూ ఒక క్రేజీ అటెంప్ట్ చేశాడు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 6:45 AM GMT
మంగళవారం చూసి అలా మాత్రం చేయకండి.. డైరెక్టర్ రిక్వెస్ట్..!
X

Rx 100, మహాసముద్రం రెండు సినిమాలతోనే డైరెక్టర్ గా తన ముద్ర వేసుకున్న అజయ్ భూపతి తన మూడో సినిమాగా మంగళవారం అంటూ ఒక క్రేజీ అటెంప్ట్ చేశాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటిస్తుంది. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం జరిగింది. ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అయ్యారు.

తను చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉండే అజయ్ భూపతి మంగళవారం సినిమా గురించి కూడా అదే చెప్పారు. ఈ సినిమా ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో వస్తుందని సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని అన్నారు. సినిమాతో మీకు పూనకాలు వచ్చేస్తాయని అభిమానులను ఉద్దేశించి చెప్పారు అజయ్ భూపతి. ఈ సినిమా చూసిన ఆడియన్స్ దయచేసి సినిమాలోని ట్విస్ట్ లను రివీల్ చేయకండని రిక్వెస్ట్ చేశారు.

సినిమా చూసి మీకు బాగుంది అనిపిస్తే మరో పది మందికి చెప్పండి అంతేకాని సినిమాలోని ట్విస్ట్ లను రివీల్ చేయొద్దని అన్నారు. ఈ సినిమా కథ వినగానే నిర్మాత స్వాతి రెడ్డి ఓకే చేశారని లేడీ ఓరియెంటెడ్ సినిమా లేడీ ప్రొడ్యూసర్ కి నచ్చింది కాబట్టి ఫీమేల్ ఆడియన్స్ కి కూడా నచ్చుతుందని అన్నారు అజయ్ భూపతి.

ఇక తను ఏడాదిన్నర క్రితమే అల్లు అర్జున్ కి ఈ కథ చెప్పానని.. ఆయన తనని ఎంకరేజ్ చేశారని అన్నారు. పుష్ప హిట్ అయ్యాక సుకుమార్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు తెలియదు కానీ ఆయనకన్నా తాను డబుల్ హ్యాపీగ ఫీల్ అయ్యానని అన్నారు అజయ్ భూపతి. ఇది నా టైపు రస్టిక్ సినిమా అలాంటిది బన్నీ గారు చేయడమా.. అంత రస్టిక్ సినిమాను స్టార్ హీరోస్ ఒప్పుకోరు.. కానీ బన్నీ దాన్ని ఒప్పుకుని నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన అవార్డు అందుకోవడం మనదరికీ గర్వకారణమని అన్నారు అజయ్ భూపతి. పుష్ప తో పాన్ ఇండియా షేక్ చేసిన అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మీ అందరికన్నా ఎక్కువ నేను వెయిట్ చేస్తున్నానని పుష్ప 2 కూడా తగ్గేదేలే అని అన్నారు అజయ్ భూపతి.