Begin typing your search above and press return to search.

ఆర్డ‌ర్ మారిన స్టార్ హీరో రిలీజ్..కానీ గురి త‌ప్ప‌లే!

త‌ల అజిత్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా ప‌రాజ‌య‌మే లేకుండా స‌క్సెస్ ల‌తో రేసులో కొన‌సాగుతున్నాడు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 2:30 PM GMT
ఆర్డ‌ర్ మారిన స్టార్ హీరో రిలీజ్..కానీ గురి త‌ప్ప‌లే!
X

త‌ల అజిత్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా ప‌రాజ‌య‌మే లేకుండా స‌క్సెస్ ల‌తో రేసులో కొన‌సాగుతున్నాడు. కొత్త సినిమాల క‌మిట్ మెంట్లు అలాగే ఉన్నాయి. సినిమాలు సెట్స్ లో ఉండ‌గానే కొత్త క‌థ‌ల్ని లాక్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం `గుడ్ బ్యాడ్ అగ్లీ`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తుంటే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతుంద‌ని అంతా ఫిక్స్ అయిపోయారు.

ఏటా సంక్రాంతికి అజిత్ సినిమా త‌ప్ప‌కుండా రిలీజ్ అవుతుంది. ఈనేప‌థ్యంలో `గుడ్ బ్యాడ్ అగ్లీ` కూడా రిలీజ్ ఖాయంగానే క‌నిపించింది. జ‌న‌వ‌రి 10న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రావ‌డం లేదు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంద‌ని మ‌నోబాల విజ‌య బాల‌న్ ట్విట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ఏప్రిల్ రిలీజ్ అయినా తేదీ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఆ నెల‌లో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది.

అయితే సంక్రాంతి రేసు నుంచి `గుడ్ బ్యాడ్ అగ్లీ` ఎగ్జిట్ అయినా? మ‌రో సినిమాతో మాత్రం అజిత్ మెప్పించ‌డానికి రెడీ అవుతున్నారు. ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న మ‌రో చిత్రం `విదాముయార్చీ` జ‌న‌వ‌రి రిలీజ్ అంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ముందుగా గుడ్ బ్యాడ్ అగ్లీనే సంక్రాంతి రిలీజ్ గా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత విదామ‌యూర్చీ కి రిలీజ్ ప్ర‌క‌ట‌న కూడా అదే నెల‌లో వ‌చ్చింది. కానీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ వాయిదా పడింది.

దీంతో విదాముయార్చీకి లైన్ క్లియ‌ర్ అయింది. అభిమానుల్ని వాయిదాతో ఓ సినిమా నిరుత్సాహ ప‌రిచినా మ‌రో సినిమాతో అల‌రించ‌డానికి అజిత్ సిద్దంగా ఉన్నాడు. సంక్రాంతి రిలీజ్ అన్న‌ది అజిత్ కి సెంటిమెంట్. గ‌త ఏడాది అజిత్ న‌టించిన `త‌నీవు` చిత్రం సంక్రాంతి కానుక‌గానే ప్రేక్ష‌కుల ముందుకొచ్చి భారీ విజ‌యం సాధించింది. `గుడ్ బ్యాడ్ అగ్లీ` సినిమాతో టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేక‌ర్స్ త‌మిళ్ లో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.