Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో ఇంట 4 కోట్ల బ్రాండెడ్ కారు!

అత‌డి వ‌ద్ద ఖ‌రీదైక బైకులు..కార్లు ఎన్నో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   13 Sep 2024 12:12 PM GMT
ఆ స్టార్ హీరో ఇంట 4 కోట్ల బ్రాండెడ్ కారు!
X

త‌ల అజిత్ కి రేసింగ్ అంటే ఎంత ఆస‌క్తి అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. బైక్..కారు రేసింగ్ అన్న‌ది అత‌డికి యువ‌కుడిగా ఉన్న‌ప్ప‌టి నుంచి అల‌వాటు. ఎక్క‌డ పోటీలు జ‌రిగినా హాజ‌ర‌వుతుంటాడు. ఖాళీ స‌మ‌యం దొరికితే బైక్ పైనే వంద‌ల కిలోమీట‌ర్లు జ‌ర్నీ చేస్తాడు. ఒక్కోసారి దేశాలు..ఖండాలు సైతం దాడిపోతాడు. అత‌డి వ‌ద్ద ఖ‌రీదైక బైకులు..కార్లు ఎన్నో ఉన్నాయి. పాత కలెక్ష‌న్ తో పాటు న‌చ్చితే కొత్త వాటిని కొనేస్తుంటాడు.


తాజాగా అజిత్ ఇంట మ‌రో కారు చేరింది. పోర్షె జీటీ 2ఆర్ ఎస్ కారును కొనుగోలు చేసాడు. దీని విలువ సుమారు 4 కోట్ల‌పైనా ఉంటుంది. తాజాగా ఆ కారు ఫోటోల్ని ఆయ‌న స‌తీమ‌ణిషాలిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ కారు కంటే ముందు జులైలో అజిత్‌ ఫెరారి ఎస్‌ఎఫ్‌90 స్ట్రాడేల్‌ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ఖరీదు రూ.9 కోట్లు. రెడ్‌ కలర్‌లో ఉన్న ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ‌ని నెట్టింట వైరల్ అయింది.

కార్లు...బైకుల విష‌యంలో అజిత్ కోలీవుడ్ హీరోల్లో కింగ్ అనే చెప్పాలి. అజిత్ ని మించి భారీ పారితోషికం తీసుకునే హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్లెవ్వ‌రూ చేయ‌ని సాహ‌సం అజిత్ చేస్తుంటాడు. మిగ‌తా ఏ హీరో ఇంత ఆస‌క్తి వాటిపై చూపించ‌రు. అజిత్ మాత్రం మార్కెట్ లోకి న‌చ్చిన‌, కారు, బైక్ వ‌స్తే దాని సంగ‌తేంటో చూడాలి అనే టైప్.

ఇక అజిత్ హీరోగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం `విదా ముయార్చి`లో న‌టిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ ఏడాది సినిమా రిలీజ్ కానుంది. అలాగే `గుడ్ బ్యాడ్ అగ్లీ`లోనూ న‌టిస్తున్నాడు. ఇది కూడా ఆన్ సెట్స్ ల ఉంది. ఇది మాత్రం 2025 లో రిలీజ్ కానుంది.