Begin typing your search above and press return to search.

గుడ్ బ్యాడ్ అగ్లీ.. ప్రమోషన్స్ సంగతేంటి?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఎలాంటి క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన మూవీ వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ ఫుల్ గా సందడి చేస్తారు.

By:  Tupaki Desk   |   2 April 2025 11:10 AM
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ప్రమోషన్స్ సంగతేంటి?
X

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కు ఎలాంటి క్రేజ్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన మూవీ వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ ఫుల్ గా సందడి చేస్తారు. టాలీవుడ్ లోనూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఆయన సొంతం. అజిత్ నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ.. ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కానుంది.

రీసెంట్ గా పట్టుదల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. దీంతో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఆ సినిమాలో మూడు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానున్న ఆ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

అంత వరకు బాగానే ఉన్నా.. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ లో ఎలాంటి సౌండ్ లేదు. ఎక్కడా ఎలాంటి హడావుడి కూడా కనిపించడం లేదు. దీంతో సినిమా రిలీజ్ అవుతుందా అసలు అని చాలా మంది డౌట్ పడుతున్నారట. అయితే ప్రమోషన్స్ సౌండ్ వినపడకపోవడానికి కారణం హీరోనే అని చాలా మంది అంటున్నారు.

నిజానికి మైత్రీ మూవీ మేకర్స్.. ఏ సినిమాను అయినా ప్రమోట్ బాగానే చేస్తోంది. అందుకోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తోంది. మూవీకి తగ్గట్లు సరైన విధంగా ప్లాన్ గీసి సందడి చేస్తుంటోంది. ఆడియన్స్ లో వేరే లెవెల్ బజ్ క్రియేట్ చేస్తుంటోంది. ఆ సంగతి మనం చాలా సినిమాలను గమనించే ఉంటాం. కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలో రివర్స్ అయింది.

మెయిన్ గా అజిత్ కు ప్రమోషన్స్ పై ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన నటించిన సినిమాలకు ఫంక్షన్స్ కూడా జరగవ్. ఇంటర్వ్యూలు పెద్ద ఇవ్వరు. మీడియా ముందుకూ పెద్దగా రారు. కానీ ఇప్పుడు మైత్రీ సంస్థ.. అజిత్ తన మూవీని ప్రమోట్ చేస్తే బాగుణ్ణు అని ఆలోచిస్తుందట. రెండు మూడు ఇంటర్వ్యూలతోపాటు ఈవెంట్ కు అటెండ్ అయితే బెటర్ అని అనుకుంటుందట.

కానీ అజిత్ ఈవెంట్స్ కు వస్తారో లేదో.. ఇంటర్వ్యూలు ఇస్తారో లేదో ఎవరూ చెప్పలేం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రమోషన్స్ లో ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన దాఖలాలు లేవు. అదే సమయంలో ఆడియన్స్ లో సినిమాపై బజ్ చాలా తక్కువగా ఉంది. మరేం జరుగుతుందో.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.