Begin typing your search above and press return to search.

టాలీవుడ్ అగ్ర నిర్మాతలు.. తమిళ హీరోతో హిట్టు కొడతారా?

'జాట్' మూవీతో బాలీవుడ్ లోకి, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 11:30 AM GMT
టాలీవుడ్ అగ్ర నిర్మాతలు.. తమిళ హీరోతో హిట్టు కొడతారా?
X

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో పెట్టింది. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈ సంస్థ.. ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 'జాట్' మూవీతో బాలీవుడ్ లోకి, 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.

తమిళ స్టార్ అజిత్ కుమార్ హీరోగా మైత్రీ నిర్మాతలు నిర్మిస్తున్న సినిమా "గుడ్ బ్యాడ్ అగ్లీ". 270 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, అందులో అజిత్ రెమ్యునరేషన్ 160 కోట్లు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

డేట్ చెప్పలేదు కానీ, "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రాన్ని 2025 పొంగల్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటుగా ఒకేసారి తెలుగులోనూ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈసారి టాలీవుడ్ లో సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఏర్పడేలా ఉంది. మూడు నాలుగు పెద్ద సినిమాలు బరిలో నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టఫ్ ఫైట్ లో డబ్బింగ్ మూవీని రిలీజ్ చేయడం రిస్క్ అవుతుందేమో అనే టాక్ నడుస్తోంది.

ఆల్రెడీ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ NBK 109 చిత్రాలు సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకున్నాయి. వీటితో పాటుగా వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూట్ దిల్ రాజు నుంచి మూడు చిత్రాలు వస్తున్నాయి అంటే, మెజారిటీ భాగం థియేటర్లన్నీ బ్లాక్ అయిపోతాయి. దీనికి తోడు అక్కినేని నాగచైతన్య 'తండేల్' మూవీ కూడా విడుదల అవుతుందని అంటున్నారు. కాబట్టి మిగిలిన థియేటర్లు ఈ సినిమాకి కేటాయిస్తారు.

ఇలా తెలుగులో నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు, తమిళ డబ్బింగ్ మూవీకి థియేటర్లు దొరకడం కష్టమే అవుతుంది. వాటిల్లో ఒకటి రేసు నుంచి తప్పుకుని మూడు చిత్రాలే వచ్చినా.. "గుడ్ బ్యాడ్ అగ్లీ"కి తగినన్ని స్క్రీన్లు లభించే ఛాన్స్ లేదు. తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించాలంటే, అందుకు తగ్గట్టుగా థియేటర్లు కూడా కావాలి. ఆ తర్వాత టాక్ బాగుంటే ఆటోమేటిక్ గా మంచి కలెక్షన్స్ వస్తాయి.

ఇక తమిళ్ లోనూ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రానికి పోటీగా మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. విక్రమ్, కార్తీ లాంటి హీరోలు క్లాష్ కు వస్తారని టాక్ వినిపిస్తోంది. అజిత్ మీద మైత్రీ నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. అదంతా వెనక్కి రావాలంటే సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవాలి. అనానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టాలి. అప్పుడే నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయి.

ఇటీవల కాలంలో దిల్ రాజు, సూర్య దేవర నాగవంశీ లాంటి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కోలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి హిట్టు కొట్టారు. విజయ్ తో చేసిన 'వారసుడు'.. ధనుష్ తో తీసిన 'సార్' సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు అజిత్ కుమార్ హీరోగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మైత్రీ మూవీ నిర్మాతలు రాబోతున్నారు. వీరికి ఎలాంటి విజయం దక్కుతుందో వేచి చూడాలి.