234kms.. మరీ ఇంత స్పీడ్ అవసరమా సర్?
హీరోల వద్ద ఖరీదైన కార్లు, బైక్స్ ఉండటం చాలా కామన్ విషయం.
By: Tupaki Desk | 29 Aug 2024 9:42 AM GMTహీరోల వద్ద ఖరీదైన కార్లు, బైక్స్ ఉండటం చాలా కామన్ విషయం. ముఖ్యంగా కొందరు స్టార్ హీరోలు మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ రాగానే తమ స్టేటస్ ను చూపించుకోవడం కోసం అయినా ఆ కారును కొనుగోలు చేస్తూ ఉంటారు. కార్ల ఖరీదు లక్షలు దాటి ఇప్పుడు కోట్లకు చేరింది. అయినా కూడా ఒక్కొక్క హీరో వద్ద పదుల సంఖ్యలో ఖరీదైన లగ్జరీ కార్లు ఉంటున్నాయి. కొందరు వాటిని ఉపయోగించడం చాలా తక్కువ. కానీ కొందరు మాత్రం ఆ కార్లలో చక్కర్లు కొడుతూ ఉంటారు. అయితే ఎంత ఖరీదైన కారు అయినా జాగ్రత్తగా, మోతాదు స్పీడ్ తో వెళ్లడం మంచిది. కానీ హీరో అజిత్ మాత్రం శృతి మించాడు.
తమిళ్ స్టార్ హీరో అజిత్ కి రేసింగ్ అంటే ఇష్టం. ఆయన బైక్ పై వేల కిలో మీటర్ల ప్రయాణం చేశాడు. ఇప్పటి వరకు ఆయన లక్షల కిలోమీటర్లు కేవలం బైక్ పై ట్రావెల్ చేశాడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతగా రేసింగ్ ను, బైక్ రైడింగ్ ను ఇష్టపడే అజిత్ తాజాగా మరో సంచలనంకు కేంద్రం అయ్యాడు. సాధారణంగా ఒక రెగ్యులర్ కారులో 150 స్పీడ్ పోవడం అంటే చాలా ఎక్కువ. అలాంటిది ఆయన ఏకంగా 234 కిమీల వేగంతో కారులో ప్రయాణం చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తున్న వారు నోరు వెళ్లబెడుతున్నారు.
స్పీడ్ అంటే ఇష్టం ఉండవచ్చు... కానీ శృతి మించిన స్పీడ్ కచ్చితంగా ఏదో ఒక సమయంలో ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉంది. కనుక అజిత్ సర్ మరీ అంత స్పీడ్ అవసరమా అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. అజిత్ ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇలా స్పీడ్ గా కారు నడిపి ఉంటాడు అని కొందరు భావిస్తున్నారు. కానీ సినిమా షూటింగ్ అయితే కారులో ఉన్న స్పీడో మీటర్ ను చూపించాల్సిన అవసరం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన హీరో అజిత్ ఇలా శృతి మించడం ఏమాత్రం కరెక్ట్ పద్దతి కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వాలిమై, తునివ్వు సినిమాల తర్వాత అజిత్ నుంచి రాబోతున్న సినిమా 'విడాముయార్చి'. ఆ సినిమా షూటింగ్ సమయంలో అజిత్ కి పలు సార్లు గాయాలు అయ్యాయి. కొన్ని యాక్షన్ స్టంట్స్ సన్నివేశాలను డూప్ సహాయం లేకుండా తానే చేయడం వల్ల అత్యంత పెద్ద ప్రమాదాలు కూడా జరిగాయి. ఎన్ని జరిగినా అజిత్ లో మాత్రం మార్పు రాకపోవడం, స్పీడ్ ను తగ్గించుకోవడం వంటివి చేయడం లేదు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. బాధ్యత కలిగిన ఒక స్టార్ హీరో అయ్యి ఉండి, తన పిల్లలతో పాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలవాల్సిన అజిత్ అంతటి స్పీడ్ తో కారు ను డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.