మళ్లీ ప్రమాదం.. స్టార్ హీరో అజిత్ కార్ ఫల్టీలు
దుబాయ్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ బృందం మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అజిత్ కొన్ని నెలల పాటు రేసింగ్ లో కొనసాగాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 23 Feb 2025 6:23 AM GMTఅడ్వెంచర్ స్పోర్ట్స్ అర్థం ఎప్పుడూ ప్రమాదాలు వెంటొస్తాయని..! అలాంటి ప్రమాదాల్ని ఎదుర్కోవడంలో తళా అజిత్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. స్పెయిన్‌లో కార్ రేసింగ్ ఈవెంట్‌లో పాల్గొంటున్న కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన కారు ట్రాక్‌పై ప్రమాదానికి గురై, పలుమార్లు పల్టీలు కొట్టింది. అజిత్ మరో వాహనాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కథనాలచ్చాయి.
ప్రమాదం జరిగిన అనంతరం అజిత్ సురక్షితంగా కారు నుండి బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన రేసింగ్ బృందం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అజిత్ క్షేమంగా ఉన్నాడని ధృవీకరించారు. ప్రమాదం జరిగినప్పటికీ అజిత్ రేసులో పాల్గొనడం కొనసాగించాడు.
ప్రమాదాలు అజిత్ కి కొత్త కాదు. ఇలాంటి సంఘటనను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో దుబాయ్‌లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఆయన కారు రోడ్ సమీపంలోని గోడను ఢీకొట్టింది. దీని వల్ల వాహనం ముందు భాగం బాగా దెబ్బతింది. అయితే ఆ ప్రమాదం నుండి కూడా ఆయన సురక్షితంగా బయటపడ్డారు. దుబాయ్ రేసింగ్ ఈవెంట్‌లో అజిత్ బృందం మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అజిత్ కొన్ని నెలల పాటు రేసింగ్ లో కొనసాగాల్సి ఉంటుంది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. షూట్ గ్యాప్ లో తన సమయాన్ని కార్లు, మోటార్ సైకిళ్లకు అంకితం చేస్తున్నాడు. అజిత్ కి ఉన్న రేసింగ్ ఆసక్తి కారణంగా, అతడు భారీ పెట్టుబడితో మోటార్ సైకిల్ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఒక స్టార్టప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అజిత్ నటించిన విదాయుమార్చి ఇటీవలే విడుదలై ఫ్లాపైంది. తదుపరి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో అతడు అభిమానుల ముందుకు రానున్నాడు.