కళ్లు తిప్పుకోనివ్వని స్టార్ హీరో డాటర్!
కొడుకులు హీరోలు అయ్యారు. కొందరు స్టార్ల కూతుళ్లు స్టార్ హీరోయిన్లు అయ్యారు. మరికొందరు అదృష్టం పరీక్షించుకునే దశలో ఉన్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 2:07 PM GMTబాలీవుడ్ టాలీవుడ్ లో నటవారసుల రంగ ప్రవేశం గురించి చాలా చర్చ సాగుతోంది. ముఖ్యంగా స్టార్ల కుమార్తెలు కథానాయికలుగా ఆరంగేట్రం చేస్తుంటే ఆ వార్తలు ఎక్కువమంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ డాటర్స్ వెండితెర నాయికలుగా లక్ చెక్ చేసుకుంటున్నారు. చాలా మంది నటీమణుల కుమర్తెలు సినీరంగంలో ఉన్నారు. హీరోల నటవారసులు సినీరంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు హీరోలు అయ్యారు. కొందరు స్టార్ల కూతుళ్లు స్టార్ హీరోయిన్లు అయ్యారు. మరికొందరు అదృష్టం పరీక్షించుకునే దశలో ఉన్నారు.
అందుకే ఇప్పుడు ప్రజల దృష్టి తళా అజిత్ - షాలిని దంపతుల కుమార్తెపైనా పడింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పి.వి.సింధు పెళ్లి రిసెప్షన్ లో తళా అజిత్ తన భార్య షాలిని ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించారు. ఆయన స్టైల్ గా సూట్ లో సూపర్ మేన్ లా నడుచుకుంటూ వస్తుంటే, తన వెంటే వస్తున్నవారిలో పెద్ద కుమార్తె అనౌష్క కుమార్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందు తమ స్పెయిన్ ట్రిప్ నుండి షాలిని అనౌష్క తాలూకా అరుదైన వీడియోని షేర్ చేయగా వైరల్ అయింది. ఇప్పుడు మళ్లీ తళా అజిత్ తో కలిసి కనిపించింది.
అనౌష్క ఎరుపురంగు డిజైనర్ దుస్తుల్లో కనిపిస్తోంది. కళ్ల జోడు ధరించిన ఈ అమ్మాయి ఎంతో ఎనర్జిటిక్ గా ఆకట్టుకుంది. షారూఖ్ కుమార్తె సుహానాలాగా, శ్రీదేవి కుమార్తెలు జాన్వీ, ఖుషీ లాగా, అజిత్ కుమార్తె అనౌష్క కూడా లెగసీని ముందుకు నడిపిస్తుందా? అంటూ ఆరాలు మొదలయ్యాయి. అయితే అనౌష్క సినీరంగ ప్రవేశం గురించి ఎలాంటి సమాచారం లేదు.
అజిత్ పిల్లలు పెద్దగా లైమ్ లైట్ ని కోరుకోరు. కానీ ఇప్పుడు పెళ్లి విందులో ప్రత్యక్షమై అభిమానుల్లో చర్చనీయాంశంగా మారారు. చూడటానికి షాలిని లా కనిసిస్తోంది. ఈ అమ్మాయి పూర్తిగా అకడమిక్ విద్యపై దృష్టి సారిస్తున్నారని సమాచారం. ఇటీవలే స్కూల్ స్టడీస్ పూర్తిచేసి కాలేజీలోకి అడుగుపెట్టింది. అలాగే ఈమె ఒక కేక్ బేకర్ కూడా. తాను చేసే కేక్ డిజైన్స్ తో ఓ సోషల్ మీడియా అకౌంట్ కూడా నడిపిస్తుంది. తండ్రిలానే క్రీడాకారిణి. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. స్కూల్ లెవెల్లో స్టేట్ టోర్నమెంట్స్ లో కూడా ఆడింది. అనౌష్క చిన్నప్పుడు తన తండ్రి అజిత్ నటించిన ఎన్నై ఆరిందాల్ సినిమాలో ఓ చిన్న పాత్ర కూడా చేసింది. ఇక అనౌష్క సోదరుడు ఆద్విక్ కూడా తళా తో పాటు పి.వి.సింధు విందులో ఉన్నారు.
షాలిని - అజిత్ ఒక సంవత్సరం డేటింగ్ తర్వాత 2000లో వివాహం చేసుకున్నారు. అనుష్క 2008లో జన్మించగా, ఆద్విక్ 2015లో జన్మించారు. ఈ ఏడాది తమ 24వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. అజిత్ నటిస్తున్న రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ లో ఉన్నాయి. వీటిలో ఒకటి 2024 ప్రథమార్థంలో విడుదలవుతుంది.