నువ్వా నేనా? అగ్ర హీరోల బాహాబాహీ!
అందుకే తేదీల విషయంలో చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది.
By: Tupaki Desk | 2 Feb 2025 5:47 AM GMTఅవును.. ఇద్దరు పెద్ద హీరోలు నువ్వా నేనా? అంటూ బాహాబాహీకి రెడీ అయ్యారు. తగ్గేదేలే! అంటూ ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వార్ జోన్‌లో ఢీ అంటే ఢీ అంటున్నారు. నిజానికి ఇద్దరు పెద్ద హీరోల ఘర్షణ రిలీజ్ తేదీల విషయంలో మొదలైంది. ఈరోజుల్లో ఒకే తేదీలో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం చాలా ఇబ్బందులను తెస్తోంది. అందుకే తేదీల విషయంలో చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఇద్దరూ వెనక్కి తగ్గేదేలే అని భీష్మించుకున్నారు. ఒకరితో ఒకరు బిగ్ ఫైట్ కి రెడీ అయిపోయారు.
ఆ ఇద్దరు పెద్ద హీరోలు ఎవరు? అంటే.. తమిళ స్టార్ హీరోలు అజిత్ కుమార్, ధనుష్. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. ఒకేరోజు తమ సినిమాలను రిలీజ్ చేసి బాక్సాఫీస్ పోరులో ఆధిపత్యం చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ధనుష్ 'ఇడ్లీ కడైకి నీక్' .. అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఒకే తేదీన విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు హీరోలు ప్రకటించడంతో దీనిపై అభిమానుల్లో చాలా చర్చ సాగుతోంది. నిజానికి ధనుష్ సినిమా ఏప్రిల్ 10 రిలీజ్ గురించి చాలా కాలం క్రితమే ప్రకటన వెలువడింది. కానీ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే తేదీని లాక్ చేయడంతో, ధనుష్ తన రిలీజ్ తేదీని మార్చుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు ఊహించాయి. కానీ ధనుష్ తగ్గేదే లే! అంటూ రిలీజ్ తేదీని బోల్డ్ అక్షరాలతో ముద్రించిన పోస్టర్ ని రిలీజ్ చేయడం ద్వారా వార్ లో ఢీకి రెడీగా ఉన్నానని సిగ్నల్ ఇచ్చాడు.
మరోవైపు ధనుష్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కావాల్సి ఉంది. అదే తేదీకి ఒక రోజు ముందు, అంటే ఫిబ్రవరి 6న అజిత్ కుమార్ నటించిన 'విదాముయార్చి' చిత్రం విడుదల అవుతుందని ప్రకటించారు. తళా సినిమా ప్రకటన తర్వాత ధనుష్ సినిమాని ఫిబ్రవరి 26 కి వాయిదా వేసారు. ఈ పోటీ ప్రకటనల తర్వాత రెండు వారాలకు ఇప్పుడు ధనుష్ -ఇడ్లీ కడై, అజిత్- గుడ్ బ్యాడ్ అగ్లీ మధ్య పోటీకి తెరలేవడం ఆశ్చర్యపరిచింది. ధనుష్, అజిత్ ఇద్దరూ పోటీలో ఎక్కడా తగ్గేదేలే అని దూసుకొస్తున్నారు. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ సినిమా వస్తున్నా, తన సినిమా కంటెంట్ పై నమ్మకంతో అజిత్ పోరాటానికి సిద్ధమయ్యాడని భావిస్తున్నారు.
ధనుష్ దర్శకత్వం వహించిన 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్'లో నవతరం స్టార్లు నటించారు. పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్ , రమ్య రంగనాథన్ తదితరులు నటించారు. అలాగే 'ఇడ్లీ కడై'కి ధనుష్ దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ వండర్‌బార్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించారు. రాజ్‌కిరణ్, సముద్రఖని, నిత్యా మీనన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ విదాముయార్చికి మాగిజ్ తిరుమేని దర్శకుడు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.