అజిత్ 'పట్టుదల'.. తెలుగు ఓపెనింగ్స్ సంగతేంటి??
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ పట్టుదల (తమిళ టైటిల్- విదామయూర్చి).
By: Tupaki Desk | 4 Feb 2025 3:02 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ పట్టుదల (తమిళ టైటిల్- విదామయూర్చి). సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించగా మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సుభాస్కరన్ నిర్మించారు. ఇప్పటికే మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. పొంగల్ కు విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన పట్టుదల మూవీ.. ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. సినిమాపై హైప్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. వరుస పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. సెన్సార్ బోర్డు అధికారులు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుపుతూ రీసెంట్ గా మేకర్స్ పోస్ట్ చేశారు.
అయితే సినిమాను తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, సీడెడ్ లో శ్రీలక్ష్మీ మూవీస్ రిలీజ్ చేస్తున్నాయి. అదే సమయంలో మేకర్స్.. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్, టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ తెలుగులో పెద్దగా రావడం లేదని చెప్పాలి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ కావడం లేదని తెలుస్తోంది.
ఒకానొక టైమ్ లో టాలీవుడ్ లో కూడా అజిత్ కు మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన వివిధ సినిమాలు.. తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత మాత్రం మార్కెట్ తగ్గిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు అజిత్.. పట్టుదల మూవీ పట్ల కనీస స్థాయిలో బజ్ క్రియేట్ అయినట్లు కనపడడం లేదు.
సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరగడం లేదు. అజిత్ స్టైలిష్ గా సాల్ట్ అండ్ పేపర్ లుక్ తో నెవర్ బిఫోర్ అవతార్ లో మెప్పించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అజిత్, త్రిష మధ్య కుదిరిన క్యూట్ కెమిస్ట్రీతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లు అబ్బురపరుస్తాయని అంటున్నారు. కానీ తెలుగు ఆడియెన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు టిక్కెట్లు పెద్దగా అమ్ముడుపోవడం లేదని తెలుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ రూ.కోటి కూడా వసూలు చేయకపోవచ్చని బాక్సాఫీస్ నిపుణులు చెబుతున్నారు. తెలుగులో కోటి మార్కు దాటి ఓపెనింగ్స్ రావాలంటే అద్భుతం జరగాల్సిందేదని అంటున్నారు. తమిళ మార్కెట్ లో అజిత్ కు ఉన్న ఇమేజ్ బట్టి.. అక్కడ మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు.