రేసింగ్ పై అజిత్ సంచలన నిర్ణయం!
దుబాయ్ లో జరిగే కారు రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తప్పుకున్నా? తన టీమ్ మాత్రం యధా విధిగా పోటీలో పాల్గొంటుందని తెలిపారు.
By: Tupaki Desk | 11 Jan 2025 4:49 PM GMTతల అజిత్ ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనేందుకు దుబాయ్ కి వెళ్లిన అజిత్ ప్రాక్టీస్ లో భాగంగా రేసింగ్ కారు అదుపు తప్పది డివైడర్ ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే అజిత్ ను అక్కడ నుంచి తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు పెద్ద ప్రమాద మే అంటూ అజిత్ కి ఏమైందో? అంటూ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా అజిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ లో జరిగే కారు రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తప్పుకున్నా? తన టీమ్ మాత్రం యధా విధిగా పోటీలో పాల్గొంటుందని తెలిపారు. అజిత్ రేసింగ్ అనే టీమ్ కు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 2024లో దీన్ని ప్రారంభించిన ఆయన పోర్స్చే 992 పోటీతో పాటు, ఆసియా ఫార్ములా బీఎమ్ డబ్ల్యూ ఛాంపియన్‌షిప్, బ్రిటిష్ ఫార్ములా 3 ఛాంపియన్‌షిప్ , ఎఫ్ ఐ ఏ ఫార్ములా 2 ఛాంపియన్‌షిప్‌లలో కూడా పాల్గొ ననున్నారు. ఈ రేసింగ్ కోసం అజిత్ కొన్న నెలలు పాటు షూటింగ్ లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయిం చుకున్నారు. షూటింగ్ ...రేసింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో? సినిమాలనే పక్కన బెట్టారు.
అయితే తాజా నిర్ణయంతో అజిత్ మళ్లీ షూటింగ్ ల్లో బిజీ అవుతారని తెలుస్తోంది. ప్రతీ సంక్రాంతికి అజిత్ సినిమాలు రిలీజ్ అవ్వడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం ఎలాంటి రిలీజ్ లేకుండా అభిమా నుల్ని నిరుత్సాహ పరిచారు. 'గుడ్ బ్యాడ్ అగ్లీ', 'విదాముయార్చీ' లో ఏదో ఒకటి రిలీజ్ అవుతుందనుకుంటే ఏదీ రిలీజ్ కాలేదు.